ఔను.. ఈ తేడా ఎందుకు వచ్చింది! ఇదీ.. ఇప్పుడు ఏపీ వైసీపీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. దీనికి కారణం.. ఒకే రోజు.. వేర్వేరు ప్రాంతాల్లోనే అయినప్పటికీ..టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అదినేత, సీఎం జగన్ సభలు నిర్వహించడం.. వాటికి ప్రజలు రావడం.. సభల హిట్ టాక్.. ఈ మూడు అంశాల చుట్టూ.. ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగుతోంది.
సీఎం జగన్.. గతంలో పాదయాత్ర చేసినప్పుడు.. ఆయన అనుకూల మీడియాలో కొన్ని కొన్నిఫొటోలు వేసి .. “సభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం“ అని రాసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. అంటే.. అంత పెద్ద ఎత్తున ప్రజలు జగన్ సభలకు వచ్చారని.. సో.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు అంతే లెక్కన ప్రజలు వస్తున్నారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే.. వాస్తవంలో చూసినా.. ఇదినిజమేనని తెలుస్తోంది. బొబ్బిలిలో రెండు రోజుల పాటు చంద్రబాబు సభలు పెట్టారు. దీనికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అంతేకాదు.. దాదాపు రెండు నుంచి 4 గంటల పాటు ఆలస్యంగా సభ ప్రారంభమైనా.. వారు వేచి ఉన్నారు. సభ ఆసాంతం చంద్రబాబు చెప్పింది విన్నారు. ప్రతి విషయాన్ని చంద్రబాబు వారికి పూసగుచ్చినట్టు వివరించారు.
ఇక, వైసీపీ అదినేత జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. వరుసగా ఆయన కూడా సభలు పెట్టారు. ఒకటి కమలాపురం, రెండు పులివెందుల నియోజకవర్గాల్లో సభలు పెట్టారు. అయితే.. రెండు సభలకు కూడా డ్వాక్రా సభ్యులను తరలించారనే వాదన ఉంది. అంతేకాదు.. కొందరికి పింఛన్లు కూడా ఆపేస్తామని హెచ్చరించిన వార్తలు వచ్చాయి.
ఇక, జగన్ సభల్లో మధ్యలోనే జనం వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అంతేకాదు.. జగన్ సభ లేటవుతుందని తెలిసిన వెంటనే ప్రజలు తమ దారిలో తాము వెళ్లిపోయారు. ఇక, ఇక్కడ పోలీసులను పెట్టి నిలువరించే ప్రయత్నం చేసినా.. పెద్దగా ప్రజల నుంచి స్పందన రాలేదు. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే.. బాబు హవా పెరుగుతోందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.