స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఆ పిటిషన్లపై విచారణను అక్టోబరు 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ఈ రోజుకు ముగిశాయి.
ఆ పిటిషన్ పై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. సీఐడీ తరఫున వాదనలను అడ్వకేట్ జనరల్ శ్రీరాం వినిపించారు. మరోవైపు, సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ పై విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ రోజు చంద్రబాబుకు 3 కోర్టులలోనూ ఊరట లభించలేదు.