అమరావతే రాజధాని.. ఎవరూ మార్చలేరు

అమరావతి రైతుల శిబిరాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు సందర్శించారు. వారితో మాట్లాడారు. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నారు. దానిని ఎవరూ మార్చలేరు అని వ్యాఖ్యానించారు. న్యాయం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని గుర్తుపెట్టుకుని పోరాటం చేయాలని చంద్రబాబు వారికి పిలుపునిచ్చారు.

అమరావతి రైతుల వద్ద న్యాయం ఉంది. ఏ కోర్టులో అయినా వారిదే విజయం. రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులోను రైతులదే విజయం అని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులు ఏకాకులు కారు, ఏపీ మొత్తం వారి వైపే ఉంది. మూడు రాజధానులు అనేది ఒక తుగ్లక్ నిర్ణయం... దానివల్ల ఏమీ ఒరగదు. ఏమీ కాదన్నారు.

పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని నెగ్గించుకోలేక ఆడవాళ్లపై జగన్ సర్కారు ప్రతాపం చూపుతోందని చంద్రబాబు విమర్శించారు. కొందరు కావాలనే రైతులను, మహిళలను ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. మందడం దీక్షా శిబిరం వద్ద చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.