ఏపీలో మరో 14 నెల్లలో ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. దీనికి సెమీ ఫైనల్స్‌గా ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదాన్ని ఎంచుకున్న సీఎం జగన్.. వైసీపీ ని ముందుకు నడిపించేందుకు అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నా రు. ఎక్కడ అందివస్తే..అ క్కడ తనకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) ఎన్నికలను కూడా తనకు అనుకూ లం చేసుకుని గెలుపు గుర్రం ఎక్కి తనకు తిరుగులేదని.. తనకువ్యతిరేకత లేదని.. చాటి చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విషయంలో ఆదిలోనే సీఎం జగన్, వైసీపీ నేతలకు.. అదిరిపోయే పరిణామాలు ఎదురవుతున్నాయి. నామినేషన్ల పర్వం సాగుతున్న క్రమంలో ఎన్నికల అధికారులకు అందుతున్న నామినేషన్ల సంఖ్య.. వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
లెక్కకు మిక్కిలిగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. పైగా ఆయా ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు బరిలో దిగుతుండడం.. వారికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా.. జనసేనలు మద్దతివ్వడం వంటివి పోటీని మరింతగా పెంచుతున్నాయి.
+ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు నామినేషన్ దాఖలు చేశారు.
+ ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్ సమర్పించారు.
+ సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బా రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
+ తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నామినేషన్ వేశారు.
+ ఇదే జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
+ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నుపూస రవీంద్రారెడ్డి నామినేషన్ వేశారు.
+ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
+ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు.