టీడీపీ నేత పట్టాభికి విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనను బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ రోజు విజయవాడ మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టులో పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. ఆయనను నవంబర్ 4 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. పట్టాభి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్‌ను కోర్టు తిరష్కరించింది. దీంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. తనను పోలీసులు కొట్టలేదని కోర్టుకు పట్టాభి తెలిపారు. సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలను గానీ తూలనాడ లేదని చెప్పారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని న్యాయమూర్తికి వివరించారు.
అరెస్ట్ చేసిన తర్వాత తనను తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని పట్టాభి పేర్కొన్నారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పట్టాభి పై ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు.
పట్టాభి తిట్టింది సజ్జలను గాని జగన్ ని కాదు అని తెలుగుదేశం చెబుతోంది. జగన్ మాత్రం తిట్టింది నన్నే అంటున్నాడు. నన్ను లం… కొడుకు అన్నాడని అంటున్నాడు. ఏదైతేనేం ఇలాంటి బూతులు వాడిన కొడాలి నాని, అనిల్ యాదవ్, పేర్ని నాని, ధర్మానలను వదిలేసి పట్టాభిపై మాత్రమే కేసులు పెట్టారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.
విమర్శలు చేసినందుకు పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులుల ఇంతవరకు ఏపీలోని పలు టీడీపీ కార్యాలయం పై దాడికి దిగిన వారిని, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదు. కేసు పెట్టలేదు.
పట్టాభి ఇంట్లో ఫ్రిజ్‌లను టీవీలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను ముక్కలు చెక్కలు చేశారు. సీసీ కెమెరాలు పగులగొట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను రికార్డు చేసిన కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ను ముక్కలు ముక్కలు చేసేశారు. బయట ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు.
వైసీపీ కార్యకర్తల దాడికి నిరసనగా బుధవారం టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా 36 గంటలపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగారు.
పట్టాభి అయిన పాపం ఇప్పుడే వెళ్ళాడు,ప్రతి శుక్రవారం మీ @ysjagan గారు కూడా పోతారు దాన్ని ఎలా చూపించాలో ఒక్క సారి ఆలోచించండి #SaveAPfromYSRCP @harika_bujji @siddusss @ExCIAKGBRAWMI6 @Anithareddyatp https://t.co/pfva5cwLXz
— Ravitejanaidu siddi???? (@RavitejanaiduS2) October 21, 2021