తెలుగుదేశంలో నిత్యం ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడికి పేరు. జగన్ కు అత్యధికంగా సీట్లు వచ్చినపుడు కూడా నిమ్మల రామానాయుడు గెలిచాడు. అతను ప్రజలకు వచ్చే ప్రతి సమస్యపై ప్రజల కోణంలో పోరాడతాడు. మీడియా కవరేజీ గురించి కూడా ఆలోచించడు.
తన నియోజకవర్గంలో ప్రతి సమస్యపై నిమ్మలకి పూర్తి అవగాహన ఉంది. రైతులు, ఆక్వారైతులు , మత్య్సకారుల సమస్యలపై వారి పని విధానంపై పట్టుఉంది. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ప్రతి ఊరు, ప్రతి కాలనీ తిరిగిన ఎమ్మెల్యేగా నిమ్మలకు పేరుంది. అందుకే నిమ్మల అంటే అందరికీ ఇష్టం.
తాజాగా రైతులకు నేతలందరు ఏదో నామ్ కే వాస్తే మద్దతు పలికారు. కానీ నిమ్మల రామానాయుడు మాత్రం ఒక ఎకరాకు రైతు పెట్టే ఖర్చెంత, పడే శ్రమ ఎంత? ఏ పనులుంటాయి. వాటికి విడివిడిగా ఖర్చులు, ప్రభుత్వంచేయాల్సిన పని ప్రతిది వివరించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు కనుక ఈ ప్రభుత్వాలు అమలు చేస్తే తాను వారికాళ్లుమొక్కుతాను అంటూ ఈ కింద వివరాలు షేర్ చేశారు. ఈ కిందున్న ఫొటోలోని వివరాలు కనుక మీరు చదివితే అతని అవగాహన పై మీకు ముచ్చట వేస్తుంది.
స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా వ్యవసాయచట్టాలలో మార్పులు చేస్తారనుకొంటే రివర్స్ లో వ్యాపారులతో పోటీపడి తమకు కావాల్సిన రేటుని అసంఘటిత రైతులనే తెచ్చుకోమనటం కేంద్రం వ్యవసాయ బిల్లులలోని ప్రధానలోపం.