విజయవాడ: ఎస్ఈసీ ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్’,దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ,నిమ్మగడ్డ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాంతరం అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు.. ప్రసాదాలను అర్చకులు, ఈవో సురేష్‌బాబు నిమ్మగడ్డకు అందజేశారు. ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ,నిమ్మగడ్డ ‘ దుర్గమ్మను దర్శించుకోవడం గమనార్హం. అయితే గతంలో ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువరిచినప్పుడు ‘నిమ్మగడ్డ ‘ ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పంచజెండా ఊపడంతో ఆయన దుర్గమ్మ దర్శించుకున్నారు.