అప్పుడెప్పుడో..సంభవామి యుగే యుగే

ఒక్కడే ఒక్కడు.......
ఎన్నికలంటే ప్రభుత్వ సొత్తు కాదని రిఫార్మ్స్ చేసి చూపాడు..
ఎన్నికల కమిషన్ అంటే ఆషామాషీ కాదని నిరూపించాడు.
ఆయనే  కీ.శే. ది గ్రేట్ శేషన్ గారు.
ఆయనకు ఎవరూ కులం , ప్రాంతం , మతం ఆపాదించలేదు..
ఆయన్ను  ఏ ప్రభుత్వం వెంటాడి వేధించలేదు
రక్షణ వ్యవస్థను కానీ , సిబ్బందిని కానీ , సదుపాయాలను కానీ , నిధులనుకానీ తగ్గించలేదు ..
కోతలు పెట్టలేదు ..
ఎవరూ ఆయనపైకి కొంతమందిని ఉసిగొల్పలేదు.
ప్రాణభయం , అవమానం కల్గించలేదు.
ఆయను అందరూ అత్యధిక గౌరవంతో చూసారు..
ఎందుకంటే రాజ్యంగ వ్యవస్ధ అన్నింటికన్నా గొప్పదని ఒక్కడై నిలచి  చెప్పాడు
ఎన్నో ఏళ్ళతర్వాత..
మరో శేషన్ ని ఈ రోజు చూస్తున్నాం..
ఒక్కడంటె ఒక్కడే ..
ఉక్కులా నిలబడ్డాడు..
ప్రాణాలను ఫణంగా పెట్టాడు..
అన్ని అవమానాలను భరించాడు .
పడిపోయిన ప్రమాణాలను నిలబెట్టాడు..
రాజ్యాంగ ప్రమాణాలను రక్షించాడు..
అతడే శ్రీ నిమ్మగడ్డ రమేష్ గారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ..
రాజకీయ నాయకులకు ఒంగి ఒంగి దణ్ణలెట్టే అధికారులకు ఇదో చెంపదెబ్బ ..
ప్రజాస్వామ్యం గెలుపుకు ఎవరో ఒకరు పుట్టుకొస్తారు..
అదే మరి :
భగవద్గీత 4-8
పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతామ్ |ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||
తాత్పర్యం
“ *సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం … ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను. ”
శ్రీ నిమ్మగడ్డ రమేష్ గారికి అభినందనలు
అయన భార్య, కూతురు  ఫోటోలు బయటకు తెచ్చి
లేని కులం అంటించి
వైసీపీ బెదిరించి యాగీ చేసినా
ప్రాణాలకు తెగించి పోరాడిన
రాజ్యాంగ వీరుడుకు, ఎవ్వరు, ఆఖరికి  దేముడు కూడా న్యాయం చేయలేని స్థితిలో
న్యాయ దేవత అయన రిటైర్మెంట్ కు అర్ధమైన ముగింపు ఇచ్చింది
రెండు సామెతలు గుర్తుకు వస్తున్నాయి
భారత దేశంలో న్యాయం లేట్ అవ్వవచ్చు కానీ ఇంకా చచ్చి పోలేదు
గెలుపు ఓటమిలు దేముడికి ఎరుక
151 అంతస్తుల సామ్రాజ్యాన్ని ప్రాణాలు తెగించి ఒక్కడు గా  పోరాడిన మరో శేషన్ ఎందరో ఐఏఎస్ లకు స్ఫూర్తి
అన్ని ఉన్న ఆకు అణిగి ఉంటుంది
ఏమి లేని ఆకు ఎగిరి పడుతూనే ఉంటుంది
ఇవాళ రమేష్ కుమార్ భార్య, కూతురు బజారున పడితే నవ్విన జనం, రేపు ఇదే తమకు ఎదురు అయితే ఎవ్వడు మిగలలేదే అని ఏడుస్తారు
న్యాయ దేవత కు సలాం
భారత రాజ్యాంగానికి సాష్టాంగ నమస్కారం
చనిపోనీ విలువలకు ఇంక్విలాబ్..

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.