ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేగుతోంది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషను విచారణకు రాకపోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పని మొదలుపెట్టేశారు.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు. క్రైస్తవ మత ప్రచారం చేసిన గుంటూరు కలెక్టరుతో పాటు చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. వీరితో పాుట తిరుపతి అర్బన్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 23న అంటే శనివారం రిలీజ్ కానుంది. ఏపీలో నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మొదటిదశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని చెప్పిన అంశాన్నినిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా గవర్నర్ జోక్యం చేసుకుని వారు విధులకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉద్యోగులను డైరెక్ట్ చేయాలని నిమ్మగడ్డ గవర్నర్ ని కోరినట్టు తెలిసింది.