అయోధ్య ఆలయానికి పవన్ విరాళం ఎంత?

తిరుపతి పర్యటనలో శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ఒక ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి తన వంతు విరాళం ప్రకటించారు. రామ్ మందిర్ ట్రస్ట్‌కు రూ .30 లక్షల విరాళం ప్రకటించిన పవన్ సంబంధిత వ్యక్తులను వాటిని అందజేశారు.

ఈరోజు మధ్యాహ్నం తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారికి ఆ చెక్కులను అందించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత సిబ్బంది రూ. 11000 ఇచ్చారు. ఆ చెక్కును కూడా భరత్ జీ గారికి అందించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

రామ్ మందిరాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని, ఇది ఒక శుభపరిణామం అని పవన్ అన్నారు.  క్రైస్తవులు, ముస్లింలు సహా వివిధ మతాలకు చెందిన వారు విరాళాలు ఇవ్వడం ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేలా ఉందన్నారు. రాముడు ధర్మానికి ప్రతీక అన్నారు. అనేక దాడులకు గురైన  తన సహజమైన పోరాటపటిమతో శతాబ్దాలుగా భారతదేశం బలంగా ఉందని పవన్ అన్నారు.

ఈ భూమిలో శాంతి కోసం రాముడు ఒక శాశ్వత ఉదాహరణ నెలకొల్పాడన్నారు.రామ రాజ్యంలో  పౌరులు సహనానికి ప్రతీకలని... అదే ఈరోజు భారతదేశం అలవరుచుకుందన్నారు. భారతదేశం ఐక్యతలో వైవిధ్యం ఉన్న దేశం, ఇక్కడ అన్ని మతాల ప్రజలు శాంతి మరియు సామరస్యంతో జీవించాలని పవన్ అన్నారు.  ఇదిలా ఉండగా.. అయోధ్యకు విరాళం ప్రకటించిన తొలి టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణే.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.