నోరు జారి పదవికి ముప్పు తెచ్చుకున్న సజ్జల...
రాజ్యాంగం తెలియకపోతే... పదవులు ఊడిపోతాయి అని నిరూపించారు ఎన్నికల ముఖ్య అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుకు నిమ్మగడ్డకు లేనిపోని సంబంధాలు అంటగట్టే క్రమంలో అసలు విషయం మరిచిపోయిన వైసీపీ ఇప్పటికే చాలా సార్లు బుక్అయ్యింది.
ప్రభుత్వాలకు సలహాదారుగా చేరి సలహాదారు పనిచేయకుండా అధికారికంగా ప్రభుత్వం తరఫున మంత్రులు చేయాల్సిన ప్రకటనలు అన్నీ వారిని పక్కన పెట్టి తానే చేస్తున్న రెడ్డికి రాజ్యాంగం బుక్కు చేతపట్టుకుని ఒక్కటిచ్చాడు ఏపీ ఎస్ఈసీ.
చట్టం ప్రకారం సజ్జలది రాజకీయ పదవి కాదు, ప్రభుత్వ ఉద్యోగం. ఆ ఉద్యోగంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఆఫీసుకు వెళ్లకూడదు. వైసీపీ తరఫున మాట్లాడకూడదు. రాజకీయ పదవి చేపట్టకూడదు.
అయితే, వైసీపీ వాళ్లు రాజ్యాంగం ఉనికి గుర్తించడానికే ఇష్టపడరు. ఇక అందులో సమాచారం ఏం తెలుసుకుంటారు.? కోర్టులు చెప్పినప్పుడల్లా ఒక్కో పాయింట్ తెలుసుకుంటూ ఉంటారు.
తాజాగా తనపై దురుద్దేశంతో రాజకీయ దాడి చేస్తున్న సజ్జల తదితరులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్మణరేఖ దాటారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
నా మీద రాజకీయ దాడి చేస్తున్నారని లేఖలో ఆరోపించిన నిమ్మగడ్డ.. భారత అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని లేఖలో కోరుతూ చట్టం మీరినందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని కోరారు. నిమ్మగడ్డ దెబ్బకు సజ్జల పదవి ఊడిపోయేలా ఉంది.
ప్రవీణ్ ప్రకాష్ పై వేటు
మరోవైపు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పై నిమ్మగడ్డ వేటు వేశారు. ఆయనను బదిలీ చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఇకపై అతను ఏ సమావేశం ఏర్పాటుచేయకుండా చేశారు.
SEC Nimmagadda transfers Praveen Prakash, using his plenary powers. Bars him from interacting with Collectors and SPs. pic.twitter.com/5dVyySOurQ
— Ramesh Kandula (@iamkandula) January 29, 2021