ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వ్యాఖ్యలు రాజ్యాంగ సంక్షోభానికి కారణం అవుతున్నాయి. ఎన్నికల సంఘానికి ఎదురుచెప్పే హక్కు రాజ్యాంగం ఉద్యోగ సంఘాలకు కల్పించలేదు. ఎన్నికల కోడ్ అమలయ్యాక… ఎన్నికల అధికారి రాష్ట్రంలో సుప్రీం. కేవలం రాజకీయ ప్రయోజనాలతో ఎన్నికల అధికారిని బహిరంగంగా దూషించడం, ధిక్కరించడం… చట్టపరంగా నేరం.
అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతగా పదవి చేపట్టిన వెంకట్రామిరెడ్డి వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువగా జగన్ పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది. ఆయన చర్యలు కూడా దానిని బలపరిచేలా ఉన్నాయి. జగన్ కి ఎన్నికలు ఇష్టం లేవన్న కారణంతో ఆయన అభిమాని, ఆయన సామాజిక వర్గం అయిన వెంకట్రామిరెడ్డి… అన్నిటికి తెగించి ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ ను దూషిస్తున్నారు. ఈరోజు ఒకడుగు ముందుకు వేసి తమ ప్రాణాలకు ముప్పు కలిగితే ప్రాణాలు తీసే హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హర్ట్ అయ్యారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు దీనిపై లేఖ రాశారు. వెంకట్రామిరెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ఆ లేఖలో డీజీపీని కోరారు. తనకు ప్రాణహాని కలిగిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని నిమ్మగడ్డ డీజీపీని కోరారు.
ఇదిలా ఉండగా… వైకాపా నాయకులు కూడా చేయని కామెంట్లు వెంకట్రామిరెడ్డి చేస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేయడానికి వెంకట్రామిరెడ్డికి ఎటువంటి అర్హత లేదు. అయితే… ఉద్యోగం పోయినా జగన్ ఏదో ఒక పదవి ఇస్తారన్న ధైర్యంతో ఎంతకైనా హద్దులు దాటి మాట్లాడుతున్నారు ఆయన. ఆయన జగన్ కులమే కాబట్టి ఆయనకు జగన్ పదవి ఇస్తారు. కానీ ఉద్యోగులు అందరూ ఎస్ఈసీకి ఎదురెళితే… వారందరిని జగన్ కాపాడటం కష్టమే.