Big news: ఆందోళనకారులపై రేప్ కేసు, చంద్రబాబు ఆగ్రహం
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా... బ్రిటిషర్ల కాలంలో కూడా చూడనంత దమనకాండ ఏపీలో మొదలైనట్లు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆందోళనలను అణచివేయడానికి, ఆందోళనకారులను భయపెట్టడానికి అప్పట్లో బ్రిటిషర్లు కూడా పన్నని వ్యూహాలు జగన్ సర్కారు పన్నుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.
‘‘జిఓ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి సిఎం ఇంటికి గెరావ్పై ప్రయత్నించిన టిఎన్ఎస్ఎఫ్ సభ్యులను అరెస్టు చేయడమే కాకుండా నకిలీ రేప్ కేసుతో నినాదాలు చేశారు. అవును, మీరు సరిగ్గా చదివారు. అది రేప్ కేస్ యే! ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం యొక్క అనాగరిక మతిలేని చర్య. ఆందోళనలను అణిచివేయడానికి, నిరసన స్వరాలను అణిచివేసేందుకు వాక్ స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ ప్రదర్శించిన చర్య’’ అంటూ తెలుగుదేశం పార్టీ దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం చర్యపై చంద్రబాబు కూడా అర్ధరాత్రి సమయంలో దీనిని ఖండిస్తూ ట్విట్టరులో ప్రకటన విడుదల చేశారు.
At the behest of AP CM, the police have registered a RAPE CASE on students protesting against GO 77. This heinous act has been committed to jeopardise the future of youngsters fighting on behalf of students. What message are you conveying to the youth of AP? Shameful! pic.twitter.com/uTDWfzXwEs
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 23, 2021
దీనిపై లోకేష్ స్పందిస్తూ అధికార దుర్వినియోగపు శిఖరం ఇది అని వ్యాఖ్యానించారు. ఇంత హీనమైన విధానాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు.