ఇటు నిమ్మగడ్డ అటు ప్రభుత్వం ఒకళ్ళపై మరొకళ్ళు ఆధిపత్యం చెలాయించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించనున్న సమావేశానికి వైసీపీ హాజరుకాకూడదని డిసైడ్ చేసింది. నిమ్మగడ్డ నిర్వహించాలని అనుకుంటున్న సమావేశానికి తాము హాజరుకూకడదని డిసైడ్ చేసినట్లు పార్టీ ఎంఎల్ఏ, అధికార ప్రతినిధి అబంటి రాంబాబు ప్రకటించారు.
దాదాపు ఎనిమిది మాసాలుగా ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే. కేసు విచారణలో భాగంగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో చర్చించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దన్న సుప్రింకోర్టు ఆదేశాలను కూడా నిమ్మగడ్డ లెక్కచేయలేదన్నది వైసీపీ ఆరోపణ. సుప్రింకోర్టు చెప్పిన దానికి భిన్నంగా ముందు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహింబోతున్నారట. ఇదే కారణాన్ని చూపించి వైసీపీ సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నది. అయితే, నిర్ణయం తీసుకునేటపుడు ప్రభుత్వంతో చర్చిస్తే చాలు అన్నది సుప్రీంకోర్టు రూలు అని నిమ్మగడ్డ అనుకుంటున్నారట.
ఎన్నికల గుర్తింపున్న పార్టీలంటూ ఎలక్షన్ కమీషన్ 19 పార్టీలను సమావేశానికి ఆహ్వానించింది. సరే ఏ పార్టీ వస్తుంది ఏది రాదన్నది వేరే సంగతి. అయితే సమావేశానికి అధికార వైసీపీ హాజరుకావటం లేదన్నదే కీలకం. సాధారాణంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు ఈ సమావేశాలను బహిష్కరిస్తుంటాయి. ఇక్కడ విచిత్రంగా అధికారపార్టీ బహిష్కరించింది.
అయితే, ఎందుకిలా జరిగిందంటే… నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యూహానికి వైసీపీ భయపడింది. మామూలుగా అయితే అన్నీ పార్టీలతో కలిపి కమీషనర్ సమావేశం నిర్వహిస్తారు. ఇపుడు కూడా నిమ్మగడ్డ అన్ని పార్టీలతో మాట్లాడుతున్నారు. కానీ అందరితో సమావేశంలా కాకుండా ప్రతిపార్టీతో విడివిడిగా సమావేశం అవుతారట నిమ్మగడ్డ. ఈ ట్విస్టును వైసీపీ ఊహించలేదు. నిమ్మగడ్డ వేసిన ఈ ప్లాన్ తో అధికార పార్టీ బెంబేలెత్తిపోయింది.
అంటే ఎన్నికల నిర్వహణపై ఏ పార్టీ తన అభిప్రాయం చెప్పిందనే విషయం మిగిలిన పార్టీలకు తెలిసే అవకాశం లేదు. సమావేశం అంతా అయిన తర్వాత చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏది చెబితే దాన్నే నమ్మాలి. ఇటువంటి నేపధ్యంలోనే ఎస్ఈసీ సమావేశానికి హాజరైతే బుక్కవుతామన్న అనుమానంతోనే వైసీపీ దూరంగా ఉందన్న విషయం అర్థమవుతోంది. వాస్తవానికి సుప్రీం చెబుతున్నట్లు …నిమ్మగడ్డ చేయకపోయినా స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవకాశం నిమ్మగడ్డకు ఉన్న నేపథ్యంలో ఇది ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి.