రేవ్ పార్టీ రేర్ పార్టీ అబ్బా ! ఉగాది వేళ ఆ మాత్రం ఉండాలి. షడ్రుచుల సారం తెలియాలి. తెలియకుండా ఉంటే ఎలా ? అవే కదా కళాత్మక విలువలను పెంపొందించేవి మరియు సృజన సంబంధ విలువలను అందించేవి కూడా! మా అమ్మాయి అక్కడ ఉండడం తప్పు అని నాగబాబు అంటే హుందాతనం.
మా అమ్మాయి ఏ తప్పూ చేయలేదు అని చెప్పడం సమర్థింపు. తప్పును సమర్థించడంలో ఓ తండ్రి హోదాలోనో స్థానంలోనో ఎందుకని మళ్లీ మరో తప్పు లేదా పాపం చేస్తారు. పాపమే! అవును తప్పులను దిద్దకపోవడం తండ్రి హోదాలోనో స్థానంలోనో పాపమే !
ఈ కేసులో నిజానిజాలు వెల్లడిలోకి వస్తే అప్పుడు పాప పుణ్యాల నిష్పత్తి ఎంతన్నది తేలిపోతుంది. ఆ విధంగా ఈ కేసులో నిహా తప్పిదం ఉందా లేదా అన్నది కూడా ఒకటి తప్పక నిర్థారణ అవుతుంది.
అవ్వాలి కూడా! పోలీసులు క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారో కూడా నాగబాబు చెబితే సంతోషమే! ఆ విధంగా దర్యాప్తు ముందుకుసాగితే మేలు. విచారణలో రాజకీయ జోక్యం అతి చేయకుండా ఉంటే ఇంకా మేలు. సాధ్యమా ?
డబ్బులున్న కుటుంబాలకు మాత్రమే వివాదాలు చుట్టిముడుతున్నాయా? ఒక పూట కడుపు నిండితే చాలు అనుకున్న కుటుంబాలకు, తాగి వాగి తూలే ఆధునిక సంస్కృతిని నెత్తిన పెట్టుకుని తిరిగే కుటుంబాలకు ఎంత తేడా !
గతంలో నిహారికా భర్త ఆయన స్నేహితులు నానా గొడవ చేశారు ఓ సందర్భంలో ! ఆ విధంగా వార్తలు వచ్చాక ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర ఆయన గారి స్నేహితులు తాగి తూలి గొడవ చేశాక వార్తలు మరిన్ని రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇందులో నిజానిజాలు దేవుడికే ఎరుక!
ఇప్పుడు కూడా ఏం లేదు. ఏం కాదు రానా కేసు ఏమయింది. పూరీ కేసు ఏమయింది.అలానే నిహా కేసు కూడా క్లోజ్. ఆమె కొకైన్ తీసుకున్నారా లేదా కాదు అస్సలు నేర సంబంధ ప్రదేశంలో ఆమె వేళ కాని వేళ ఉండడమే అతి పెద్ద తప్పిదం. ఆమె ఇరుక్కున్నారా లేదా ఇరికించారా అన్నవి కూడా పోలీసుల దర్యాప్తులో లేదా నిహారికా అత్యంత నిజాయితీతో చెప్పే మాటల్లో తేలాలి. కానీ అందుకు తగ్గ ఆస్కారం సమీప భవిష్యత్ లో ఉంటుందో ఉండదో అన్నది కూడా ఓ సందేహమే!