ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో బ్యాడ్ టైమ్ బంతాడేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీ వరుస ఫ్లాప్ చిత్రాల కారణంగా అప్పుల్లో కూరుకుపోయి ఆస్తులను అమ్మకానికి పెట్టాడు. రీసెంట్ గా రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన భారతీయుడు 2 చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా పరాజయం పాలవ్వడానికి అనేక అంశాలు కారణం అయ్యాయి. కానీ వాటిని పట్టించుకోకుండా కొందరు ట్రోలర్స్ రకుల్ ప్రీత్ సింగ్ ను టార్గెట్ చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి భారతీయుడు 2 ఫ్లాప్ అవ్వడానికి రకులే కారణమంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. 1996లొ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా భారతీయుడు 2 సినిమాను తీశారు శంకర్.
కానీ సీక్వెల్ లో శంకర్ మ్యాజిక్ ఏ మాత్రం వర్కోట్ కాలేదు. అందువల్ల తొలి ఆట నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. భారతీయుడు 2 బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించిందన్న పేరే తప్పా.. ఆమె స్క్రీన్ పై పట్టుమని పావు గంట కూడా లేదు. అయినప్పటికీ రకుల్ వల్లే సినిమా ఫ్లాప్ అయిందని పలువురు అంటున్నారు.
సీక్వెల్ చిత్రాలకు రకుల్ కరెక్ట్ కాదని.. ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే హిట్ కొట్టలేరని చెబుతున్నారు. ఉదాహరణగా కిక్ 2, మన్మథుడు 2 మరియు భారతీయుడు 2 చిత్రాలను చూపిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ మూడు సీక్వెల్స్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో సీక్వెల్ మూవీస్ కు రకుల్ కరెక్ట్ కాదనే సెంటిమెంట్ బలపడినట్లైంది.