నెల్లూరులో రౌడీ రాజ్యం జడలు విప్పుకుంది. బెట్టింగ్ గొడవల్లో పలువురు యువకులను రౌడీ గ్యాంగులు విపరీతంగా చితకబాదాయి. సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏపీలో శాంతిభద్రతల స్థాయిని ప్రశ్నిస్తోంది.
యువకుడిని కొందరు అత్యంత రాక్షసంగా దొడ్డుకర్రతో కొడుతూ హింసిస్తుంటే మరికొందరు దానిని వీడియో తీస్తు ఎంజాయ్ చేస్తున్నారు. కర్రతో కొడుతున్న వ్యక్తి రాజశేఖర్ అని, అతనిపై గతంలో పలు కేసులు ఉన్నాయని చెబుతున్నారు.
ఏపీ పరిస్థితులను గమనిస్తున్న వారు… ఇలాంటి దాడి కచ్చితంగా అధికార పార్టీ అండ ఉన్నవారే చేయగలుగుతారని, తాము ఏం చేసినా ఏమీ కాదని ధైర్యం వచ్చినపుడే ఇలాంటి కిరాతక పనులు చేస్తారని అంటున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వాడికి అసలు కనికరం లేదా; మనిషిని గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు? వెంటనే అతన్ని అరెస్టు చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.