ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు లేఖ రాసిన సీఎస్ నీలం సాహ్ని – కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదన్న సీఎస్ – కరోనా కట్టడికి రాష్ట్రాలు.. వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి – ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు – చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది – ఏపీలో 6,890 మంది కరోనా వల్ల మృతి చెందారు – మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు – ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది – ఇప్పటికే పరిపాలన సిబ్బంది కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు – కరోనా కట్టడికి పోలీసు సిబ్బంది, వివిధ శాఖలు కృషి చేస్తున్నాయి – పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణపై సమాచారం – ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు – రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సరికాదు – ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి – ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చారు – ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని భావిస్తున్నాం .
సీఎస్ నీలం సాహ్ని లేఖపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ – ఇది రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుకోవడమే అవుతుంది – రాజ్యాంగ వ్యవస్థలకు సహకరించాల్సింది పోయి ఇలాంటి చర్యలు సరికాదు – ఇది వ్యవస్థలను కించపర్చడమేనంటూ సీఎస్‌కు మేసేజ్ పంపిన నిమ్మగడ్డ