తెలంగాణాతో పాటు ఈఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఐదురాష్ట్రాల విషయంలో నరేంద్ర మోడీ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కీలకమైన నిర్ణయ అనేకన్నా కొత్త ప్రయోగంచేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ ప్రయోగం ఏమిటంటే జోడుపదవులు కేటాయించటమట. ముందుగా తెలంగాణాను తీసుకుంటే షెడ్యూల్ ఎన్నికలు డిసెంబర్లో జరగాలి. అయితే అక్టోబర్లోనే షెడ్యూల్ వచ్చేస్తుందనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడి మార్పుపైన కూడా విపరీతమైన సానుకూల, వ్యతిరేక ప్రచారం అందరికీ తెలిసిందే.
ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చి ఆ స్ధానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తారన్నది ప్రచారం సారాశం. కిషన్ రెడ్డి ప్లేసులో కేంద్రమంత్రివర్గంలోకి బండి వెళతారనే ప్రచారం బాగా జరుగుతోంది. అయితే మోడీ ఆలోచనలు మారిపోయినట్లు తెలుస్తోంది. ఎలాగంటే అధ్యక్షుడిగా బండిని తప్పించటం ఖాయమంటున్నారు. కిషన్ రెడ్డిని అద్యక్షుడిగా నియమించి కేంద్రమంత్రిగా కూడా కంటిన్యు చేస్తే ఎలాగుంటుందని మోడీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చేసిన నేపధ్యంలో ఇపుడు గనుక అధ్యక్షుడిని మార్చటం అంత చిన్న విషయం కాదు. అయితే కిషన్ కూడా గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన నేతే కాబట్టి పెద్ద సమస్యగా ఏమీ ఉండదు. అయితే ఒకవైపు అద్యక్షుడిగా ఉంటూనే మరోవైపు కేంద్రమంత్రిగా కంటిన్యు చేస్తే ప్రోటోకాల్ సమస్యలు ఉండవని అనుకుంటున్నారట. ఉత్త అధ్యక్షుడిగా ఉంటే ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు. అందుకనే వివిధ ఆందోళనలకు పిలుపిచ్చినపుడు బండిని పోలీసులు అరెస్టుచేశారు.
అదే అధ్యక్షుడితో పాటు కేంద్రమంత్రిగా ఉంటే పోలీసులు అంత తొందరగా యాక్షన్ తీసుకోలేరని మోడీ ఆలోచనట. ఈ ప్రయోగం తెలంగాణాలో చేస్తే ఫలితం ఎలాగుంటుందో చూడాలని అనుకుంటున్నారట. మరి అధ్యక్షుడిగా బండిని తప్పించి ఏమిచేస్తారు ? అవకాశముంటే కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారు. లేకపోతే జాతీయస్ధాయిలో ఇంకేదైనా పదవి అప్పగిస్తారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఏ విషయం ఆది, సోమవారాల్లో డిసైడ్ అయిపోతుందని కమలనాదులు చెబుతున్నారు. ఎందుకంటే సోమవారం క్యాబినెట్ పునర్ వ్యవస్ధీకరణ ఉంటుందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే.