ఏపీలో ఓ పక్క కొత్త జిల్లాల హడావిడి..మరో పక్క…కొత్త మంత్రివర్గ కూర్పు పంచాయతీ….వెరసి రాజకీయ రచ్చ మామూలుగా లేదు. సాధారణంగా అయితే, ఈ టైంలో సీఎం జగన్ రాష్ట్రంలోనే ఉండి చాలా బిజీబిజీగా ఎమ్మెల్యేలు, నేతలతో వరుస భేటీలు చేస్తుండాలి. కానీ, ఈ పనులన్నింటినీ పక్కకు నెట్టేసిన జగన్ మాత్రం హఠాత్తుగా హస్తినకు బయలుదేరారు. అంతేకాదు, జగన్ బయలుదేరే సమయానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్ లు ఖరారు కాలేదు.
అయినా సరే అంత కొంపులు మునిగిపోయినట్లు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారన్న ప్రశ్న ఏపీలోని ప్రతిపక్ష నేతలకే కాదు…ప్రజల మెదళ్లనూ తొలిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టారు. జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో తాము చెబితే ప్రతిపక్ష నేతల ఆరోపణలు అంటారన్న ఉద్దేశ్యంతో లోకేశ్…ఆ ప్రశ్నపై ఒపీనియన్ పోల్ పెట్టారు. జగన్ దేని కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రశ్నించిన లోకేశ్.. ఓ నాలుగు అంశాలను జవాబులుగా ప్రస్తావించారు. పేలని జగన్ హస్తిన పయనమెందుకు? పేరిట లోకేశ్ సంధించిన ఈ పోల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
1. బాబాయి హత్య కేసులో దొరికిపోయిన అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు
2 తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేసేందుకు
3. తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తును ఆపేయాలని కోరేందుకు
4. లక్ష కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని కోరేందుకు