ఎవరిది శవ రాజకీయం? తండ్రి శవం దొరక్క ముందే సంతకాలు సేకరించిన @ysjaganదా?బాబాయ్ శవాన్ని ఎన్నికల ఎజెండాగా వాడుకున్న జగన్ రెడ్డిదా?హత్యలు చేయిస్తూ ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్న జగన్ రెడ్డిదా?హత్యకు గురైన నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన @ncbn గారిదా?
పైది లోకేష్ ట్వీట్ యతాతథంగా ! ఇది వైసీపీకి మామూలుగా ఇబ్బందిపెట్టలేదు.. ఓ రేంజ్ లో తగిలింది. అంతేకాదు, ఇటీవల జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రతి విషయంలో పాయింట్ తో కొడుతున్న లోకేష్ తాజాగా కడప జిల్లా నడిబొడ్డున పంతం పట్టి నెగ్గించుకున్నాడు.
నందం సుబ్బయ్య దారుణ హత్య ఉదంతం తెలిసిందే. ప్రత్యర్థులు నరికి చంపారు అన్న విషయం అందరికీ తెలుసు. పిల్లలు ఉన్న మనిషిని కేవలం విమర్శలు చేసినందుకు నరికి చంపారని టీడీపీ ఆరోపిస్తుంది. అతను ఒకవేళ తప్పులు చేసినా కేసులు పెట్టి కోర్టుకు లాగాలి, లేదా రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ప్రత్యర్థులు ఓర్చుకోలేక హత్యకు పాల్పడ్డారు.
ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లారు. అంత దారుణ హత్య జరిగితే అనుమానితుల పేర్లు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తంచేశారు. అంతేకాదు, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, అంతవరకు నేను ప్రొద్దుటూరు విడిచి వెళ్లను అని సుబ్బయ్య భార్య అపరాజితతో పాటు ధర్నాలో కూర్చున్నారు లోకేష్.
ఇది ఇంకెంత డ్యామేజ్ చేస్తుందనుకున్నారో ఏమో డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు వచ్చి లోకేష్ తో చర్చించారు. ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధలను కేసులో చేర్చాలని అపరాజితతో పాటు డిమాండ్ చేశారు. వీరి పేర్లను చేర్చేంత వరకు ప్రొద్దుటూరులోనే ధర్నా చేస్తానని లోకేశ్ హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. దీంతో పోలీసులు తలొగ్గారు. అపరాజిత వాంగ్మూలాన్ని నమోదు చేశారు. హత్య కేసులో ప్రసాద్ రెడ్డి, బంగారురెడ్డి, రాధల పేర్లను చేర్చారు. సెక్షన్ 161 ప్రకారం నమోదు చేసిన అపరాజిత వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పిస్తామని హామీ ఇచ్చారు. 15 రోజులలో విచారణ వేగవంతం చేసి, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని లోకేశ్ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ హామీ ఇచ్చారు.