• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!

admin by admin
March 29, 2025
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
93
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌పై గ‌ట్టిగా సెటైర్లు పేల్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ‌హించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు త‌దిత‌రులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి లోకేష్ సుధీర్గ ప్ర‌సంగంతో ఆక‌ట్టుకున్నారు.

పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నారు. కార్య‌క‌ర్తే పార్టీ అధినేత అన్నారు. కార్యకర్తల కోసం తాను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాన‌ని లోకేష్ పేర్కొన్నారు. అలాగే పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాల‌ని.. యువ‌కులు రాజ‌కీయాల్లోకి రావాల‌ని లోకేష్ పిలుపునిచ్చారు. సీనియర్లను గౌరవిస్తా.. పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా.. అదే నా స్టైల్ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

ఇక ఈ క్ర‌మంలోనే ప‌రోక్షంగా వైసీపీ నేత‌ల‌ను ఉద్ధేశించి లోకేష్ సెటైర్లు పేల్చారు. `ఈ మ‌ధ్య ఎక్క‌డికి వెళ్లిన రెబ్ బుక్ గురించి డిస్క‌ష్స్ జ‌రుగుతున్నాయి. నిజానికి నేను రెబ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే, రెడ్ బుక్ పేరు వింటే చాలు కొంత మందికి గుండెపోటు వ‌స్తుంది. కొంత‌మంది బాత్రూంలో కాలు జారి చేతులు విర‌గొట్టుకుంటున్నారు. అర్థ‌మైందా రాజా.. అర్థ‌మైందా రాజా..` అంటూ ఇన్‌డైరెక్ట్ గా కొడాలి నాని, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి జ‌రిగిన సంఘ‌ట‌ల‌ను మంత్రి లోకేష్ గుర్తు చూస్తూ పంచ్‌లు వేశారు.

కాగా, గ‌త కొద్ది రోజుల నుంచి వైసీపీ నేత‌ల అరెస్ట్‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. అయితే లిస్ట్ లో నెక్స్ట్ ఉన్న‌ది కొడాలి నాని అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇలాంటి త‌రుణంలో కొడాలి నానికి గుండె పోటు అనే వార్త తెర‌పైకి వ‌చ్చింది. నిజంగా ఆయ‌న‌కు గుండె పోటు రాలేదు. గ్యాస్ట్రిక్ సమస్యతో మూడు రోజుల క్రితం హాస్పిట‌ల్ లో అడ్మిట్ అయ్యారు. కొన్ని ప‌రీక్ష‌ల అనంత‌రం గుండె సంబంధిత స‌మ‌స్య కూడా ఉంద‌ని వైద్యులు గుర్తించారు. మ‌రోవైపు లిక్కర్ స్కాంలో అడ్డంగా ఇరుక్కున్న‌ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బాత్ రూమ్ లో కాలు జారి పడ్డారు. ఆయన కుడిచేయి ఎముక చిట్లిడంతో.. వైద్యులు స‌ర్జ‌రీ చేశారు. కొడాలి, పెద్దిరెడ్డి ఇలా ఒకేసారి హాస్పిట‌ల్ లో చేర‌డంతో.. కేసులు, అరెస్ట్‌ల భ‌యంతో వైసీపీ నేత‌లు అనారోగ్యం డ్రామాలు ఆడుతున్నారంటూ ప్ర‌త్య‌ర్థ పార్టీల అభిమానులు ఆరోప‌ణలు చేస్తున్నారు.

Tags: Andhra PradeshAP Newsap politicskodali naniminister nara lokeshnara lokeshPeddireddy Ramachandra Reddyred bookTDPysrcp leaders
Previous Post

`మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

Next Post

మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!

Related Posts

Andhra

స‌వాల్ కు సౌండ్ లేదు.. జ‌గ‌న్‌పై లోకేష్ సెటైర్‌!

April 2, 2025
Andhra

అరెస్ట్ భ‌యంతో మాజీ మంత్రి కాకాణి హైడ్రామా..!

April 2, 2025
Andhra

ఠంచ‌నుగా పంచేశారు: ద‌టీజ్ బాబు

April 1, 2025
Andhra

జైలుకైనా వెళ్తాం.. కేసుల‌కు భ‌య‌ప‌డం: పేర్ని నాని

April 1, 2025
Andhra

డాక్టర్ పద్మావతికి సుప్రీం కోర్టు వార్నింగ్

April 1, 2025
Andhra

లక్ష్మీ పార్వతికి హైకోర్టు షాక్!

April 1, 2025
Load More
Next Post

మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!

Latest News

  • స‌వాల్ కు సౌండ్ లేదు.. జ‌గ‌న్‌పై లోకేష్ సెటైర్‌!
  • అరెస్ట్ భ‌యంతో మాజీ మంత్రి కాకాణి హైడ్రామా..!
  • సూపర్ హీరోగా రవితేజ
  • ఠంచ‌నుగా పంచేశారు: ద‌టీజ్ బాబు
  • హిట్ ప‌డినా ద‌క్క‌ని ఛాన్సులు.. పాయ‌ల్ ఎమోష‌న‌ల్‌!
  • జైలుకైనా వెళ్తాం.. కేసుల‌కు భ‌య‌ప‌డం: పేర్ని నాని
  • డాక్టర్ పద్మావతికి సుప్రీం కోర్టు వార్నింగ్
  • భారీ లాభాల్లో `మ్యాడ్ స్క్వేర్‌`.. 4 డేస్ క‌లెక్ష‌న్స్ ఇవే!
  • లక్ష్మీ పార్వతికి హైకోర్టు షాక్!
  • వ‌ర్మ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఫూల్ అయిన వైసీపీ!
  • పైలట్ గా మారిన వైసీపీ నేత‌.. వీడియో వైర‌ల్‌!
  • నేడు ముంబైకి కొడాలి నాని.. కార‌ణ‌మేంటి?
  • ఆ విష‌యంలో మోదీ, నేను సేమ్ టు సేమ్‌: హ‌రీష్ శంక‌ర్‌
  • షాకింగ్: రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో `సికందర్` హెచ్‌డీ ప్రింట్
  • హైదరాబాద్ వదిలేస్తామంటున్న సన్‌రైజర్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra