టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర రాజంపేట నియోజకవర్గంలో పూర్తిచేసుకుని బద్వేలు నియోజకవర్గం లోకి ప్రవేశించింది. జంగాలపల్లి వద్ద ఇసుక డంపు భారీగా ఉండడంతో అక్కడే నారా లోకేష్ సెల్ఫీ తీసుకు న్నారు. వైసీపీ నాయకులు ఇసుక ఆక్రమంగా దోచేసి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతానికి తరలిస్తూ కోట్ల రూపాయల వెనకేసు కుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. స్థానికంగా ఉన్న వారికి ఇసుక లభించకపోయినా వైసీపీ నాయకులు మాత్రం దోచుకుంటున్నారని ఆరోపించారు.
దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ను లోకేష్‌ను పలకరించి ఫోటోలు దిగారు. బద్వేలు నియోజకర్గంలో లో పాదయాత్ర ప్రవేశించగానే స్థానిక టీడీపీ నేతలు విజయమ్మ, రితీష్ రెడ్డి స్వాగతం పలికారు. మొసలి కన్నీరు కార్చే ధనిక సీఎం అంటూ.. జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీలో ఇప్పుడు నడుస్తున్నది క్యాష్ వార్ అని నారా లోకేష్ స్పష్టం చేసారు. వందల కోట్ల విలువైన ప్యాలెస్ లో కమిషన్‌గా వస్తున్న నోట్ల కట్టల మీద పడుకుని,పేదల గురించి మొసలి కన్నీరు కార్చే ధనిక సీఎంకు పేదలను దోపిడీ దొంగల నుంచి కాపాడి, వారిని ధనవంతులను చేయడానికి తపిస్తున్న పేదల పక్షపాతి చంద్రబాబుకి క్యాష్ వార్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.
గుడ్డు `రాజకీయం`
యువగళం పాదయాత్ర సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో నారాలోకేష్‌పై గుడ్డు విసిరింది తెలుగుదేశం పార్టీ అభిమానే అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడటంపై మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. లోకేష్ పై కోడిగుడ్డు విసిరిన వ్యక్తి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిమాని అని, ఆయన నివాసానికి సమీపంలో ఉంటున్నారని తెలిపారు. అతను వైసీపీ నాయకుడని.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నాడని తెలిపారు. యువకుడి సోషల్ మీడియా ఖాతా తెరిస్తే అతను ఎవరి అభిమానో తేటతెల్లం అవుతుందన్నారు.