యాత్రలు తెలుగు ప్రజలకు కొత్త కాదు. అప్పట్లో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్ లు పాదయాత్రలు చేశారు. ఐడియా పాతదే అయినా అదే మంచి ఐడియా అంటున్నారు రాజకీయ నాయకులు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ యాత్రల క్రేజు తగ్గలేదు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టారు. టీఆర్ఎస్ బహిష్కృత నేత ఈటల పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా జనంతో నేరుగా కనెక్టయ్యే అవకాశం రావడం అనేది హైలెట్. అన్ని ప్రాంతాల ప్రజలను స్వయంగా కలిసే అవకాశం. అందుకే నాయకులు ఈ సక్సెస్ మంత్ర ను నమ్ముతున్నారు.
గతంలో పాదయాత్ర వల్ల సక్సెస్ అయిన చంద్రబాబు మరోసారి యాత్ర చేయనున్నారు. కానీ ఈసారి పాదయాత్ర చేయడం లేదు. బస్సు యాత్ర చేయబోతున్నారని సమాచారం. 2023లో ఈ యాత్ర ఉంటుందంటున్నారు.
అదే సమయంలో లోకేష్ కూడా యాత్ర చేస్తారట. ఒక వైపు నుంచి తండ్రి, మరోవైపు నుంచి కొడుకు యాత్రలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటి అంటే నారా లోకేష్ పాద యాత్ర చేయడం లేదు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గుర్తు అయిన సైకిల్ తో నియోజకవర్గాలన్ని కలియతిరుగుతారట. ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ లోకేష్ సైకిల్ యాత్ర చేస్తారట. ఇది పార్టీలో వినిపిస్తున్న తాజా సమాచారం.
కాలానుగుణంగా వస్తున్న ఫిట్ నెస్ మంత్రలో సైకిల్ కి మళ్లీ క్రేజు పెరుగుతోంది. సైకిల్ యాత్ర చేస్తే బాగా ట్రెండ్ అవుతుందని పార్టీ భావిస్తోందట.
కొందరు ఏమంటున్నారో తెలుసా… ఈ వయసులో చంద్రబాబు యాత్ర చేయగలరా అని… ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… చంద్రబాబు చేయబోయేది బస్సు యాత్ర. మరో విషయం ఏంటంటే… యువత కంటే వేగంగా తిరుమల కొండ ఎక్కగలిగినంత ఫిట్ నెస్ ఉంది చంద్రబాబుకు. ప్రతిరోజు క్రమం తప్పకుండా, యోగా ధ్యానం చేస్తారు చంద్రబాబు. మంచి ఆహార నియమాలు పాటిస్తారు.
అందుకే లోకేష్ యువకుడే కావచ్చు గాని చంద్రబాబు నేటికీ ఫిట్ అంటున్నారు ఆయన అంతరంగికులు.