భర్త చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా భార్య భువనేశ్వరి నిరసన దీక్ష కు దిగుతున్నారు. ఇదే విషయమై చంద్రబాబుకు కూడా దీక్ష చేయబోతున్నారు. చంద్రబాబేమో రాజమండ్రి సెంట్రల్ జైలులోనే దీక్షకు కూర్చుంటున్నారు. భువనేశ్వరి రాజమండ్రిలోనే దీక్ష చేయబోతున్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్షలకు ప్లాన్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా భువనేశ్వరితో పాటు రాష్ట్రమంతా తమ్ముళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్షలు జరగబోతున్నాయి. చంద్రబాబు అరెస్టు అక్రమం అని తమ్ముళ్ళంతా ప్రపంచానికి చాటబోతున్నారు.
చంద్రబాబు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేంత వరకు భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించాలని అనుకున్నారు. లోకేష్ పైన కూడా అరెస్టు కత్తి వేలాడుతోంది కాబట్టి వీలైనంతలో వీళ్ళిద్దరే కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులు, యువత, జనసేన పార్టీ నేతలతో బ్రాహ్మణి తరచు సమావేశాలు జరుపుతున్నారు. అలాగే పార్టీ నేతలతో, మద్దతుదారులతో భువనేశ్వరి భేటీ అవుతున్నారు.
ఇందులో భాగంగానే ఇప్పటికే దీక్షలు చేస్తున్న పార్టీ శిబిరాల దగ్గరకు భువనేశ్వరి రెగ్యులర్ గా వెళ్లి మద్దతు ప్రకటిస్తున్నారు. అలాగే సోమవారం తానే స్వయంగా దీక్షలో కూర్చోబోతున్నారు. అంటే ఇదంతా చూస్తేంటే రాబోయే ఎన్నికల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి యాక్టివ్ పార్ట్ తీసుకోబోతున్నారు అనేందుకు సంకేతాలుగా అనుకోవచ్చు. అందుకు ముందుగా దీక్షా శిబిరాలను సందర్శించటం అక్కడి నేతలను ఉద్దేశించి మాట్లాడటం ప్రారంభించారు. ఇపుడు తానే దీక్షకు కూర్చుంటున్నారు కాబట్టి ముందో లేకపోతే తర్వాతో కచ్చితంగా పార్టీ నేతలు, క్యాడర్ ను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతారు.
ఇప్పటివరకు రాజకీయాల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి పెద్దగా కనబడలేదు. ఇప్పుడు పరిస్థితులు అలా తోసుకొచ్చాయి కాబట్టి యాక్టివ్ పార్ట్ తీసుకోక తప్పటం లేదు. దీక్ష అయిపోయిన తర్వాత తొందరలోనే భువనేశ్వరి రాష్ట్రం మొత్తం బస్సుయాత్రకు రెడీ అవుతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అన్నీ జిల్లాల కేంద్రాల్లో భువనేశ్వరి జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అంటున్నారు. బస్సుయాత్రకు అవసరమైన రూట్ మ్యాప్ రెడీ అవుతోందట. బహుశా రెండోవారంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాల టాక్. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వల్ల 2 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ అందింది. పాడేరు వంటి ప్రాంతాల్లో సైతం స్కిల్ సెంటర్ పెట్టారు. అలాంటపుడు అవినీతి ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు చంద్రబాబుగారి మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఆయన తప్పు చేసినట్టు ఎవరూ నిరూపించలేక పోయారు… pic.twitter.com/7TAlLdHgb7
— Nara Bhuvaneswari (@ManagingTrustee) September 27, 2023
కావాలని చంద్రబాబు గారిని మానసిక క్షోబ పెడుతున్నారు – నారా భువనేశ్వరి గారు .. #IAmWithBabu pic.twitter.com/Yss2u3NcPn
— iTDP Official (@iTDP_Official) September 25, 2023