ఏడేళ్ల కిందటి మాట. అప్పట్లో నాని ఆహా కళ్యాణం అనే సినిమా చేశాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్యాండ్ బాజా బారత్‌కు ఇది రీమేక్.
తెలుగుతో పాటు తమిళంలోనూ నానీని పెట్టే రీమేక్ చేశారు. బాలీవుడ్ భామ వాణీ కపూర్ అతడికి జోడీగా నటించింది.
ఒరిజినల్లో కొన్ని హాట్ హాట్ సీన్లుంటాయి.
తెలుగులో కొంచెం డోస్ తగ్గించారు కానీ.. నాని కెరీర్లో తొలిసారిగా లిప్ లాక్ చేయాల్సి వచ్చింది ఈ చిత్రం కోసం.
ఐతే షూటింగ్లో ఎలా మేనేజ్ చేశాడో ఏమో కానీ.. థియేటర్లో ఈ సీన్ చూసినపుడు అతడి భార్య అంజన తట్టుకోలేకపోయిందట.
నాని లిప్ లాక్ చేయడం పట్ల ఫీలై థియేటర్ నుంచి బయటికి వచ్చేసిందట.
ఆమెను ఓదార్చి, సర్ది చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడిపోయానని.. ఇక ఎప్పుడూ లిప్ లాక్ సీన్లలో నటించనని చెప్పానని, దానికి కట్టుబడే సాగుతున్నానని గతంలో నాని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
కట్ చేస్తే ఆహా కళ్యాణం తర్వాత చేసిన సినిమాల్లో నాని ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్‌లు చేసిన దాఖలాలు దాదాపుగా కనిపించవు.
ఐతే అతడి కొత్త చిత్రం శ్యామ్ సింగరాయ్ మాత్రం ఇందుకు మినహాయింపు.
ఇందులో యంగ్ నానికి, కృతి శెట్టికి మధ్య ఒక లిప్ లాక్ సీన్ ఉంది. దాంతో పాటే ఒక ఇంటిమేట్ సీన్ కూడా పెట్టారు.
నాని సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు అస్సలు ఊహించాం.
ట్రైలర్లోనే లిప్ లాక్‌ను చూపించారు కానీ.. అది లైట్‌గానే అనిపించింది.
కానీ సినిమాలో దీనికి కొనసాగింపుగా వచ్చే సన్నివేశం కొంచెం ఘాటుగానే ఉంటుంది. గత అనుభవం దృష్ట్యా నాని ఈ సీన్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బహుశా ఇదంతా సినిమా కోసం నటనలో భాగంగా చేసేదే కాబట్టి ఇలాంటివి లైట్ తీసుకోవాలని నాని భార్యకు అర్థమైందేమో.
ఇలాంటి వాటిని స్పోర్టివ్‌గా తీసుకునే ఆలోచన ఆమెకు ఇప్పుడొచ్చిందేమో.
ఈ విషయంలో తన భార్యను నాని ముందే ప్రిపేర్ చేసి, కన్విన్స్ కూడా చేసి ఉండొచ్చేమో.