కడప మర్డర్ ప్రభుత్వాన్ని భారీగా డ్యామేజ్ చేస్తోంది. మర్డర్లు సజీవ దహనాలు ఏపీలో సర్వసాధారణం అయ్యాయి. ముగ్గురు మహిళలు వేర్వేరు జిల్లాలో సజీవ దహనం అయితే ఇంతవరకు నిందితులు దొరకలేదు. జేసీ ఇంటికి ఎమ్మెల్యే గొడ్డళ్లతో మనుషులను వేసుకొచ్చి దాడిచేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది.
తాజాగా కడపలో జరిగిన మర్డర్ తెలుగు సమాజాన్ని కలచివేసింది. మరీ ఇంత పరాకాష్టకు వెళ్లాయా రాజకీయాలు అని నివ్వెరపోతున్నారు. అతను ఎమ్మెల్యే బావమరిదిపై ఆరోపణలు చేయడం వల్లే ఈ హత్య చేయించారని తెలుగుదేశం ఆరోపిస్తోంది.
హత్యకు గురికాబడిన సుబ్బయ్య అంతకుముందు చేసిన ఈ ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఆ వీడియో ఇదే.