ఈ యేడు ఇప్పటికే బంగార్రాజుగా వచ్చి ఆకట్టుకున్న నాగార్జున.. సెప్టెంబర్‌లో భారీ ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర మూవీతోనూ పలకరించబోతున్నారు. అయితే దానికి ముందో తర్వాతో ‘ద ఘోస్ట్’ చిత్రంతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే అది ఖాయమనిపిస్తోంది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఎప్పుడో మొదలైపోయింది. కానీ హీరోయిన్ సెలెక్షన్ విషయంలో చాలా టైమ్ పట్టేసింది. ముందుకు సెలెక్ట్ చేసుకున్న కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో వేరే హీరోయిన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. చాలామందిని పరిశీలించి చివరకు సోనాల్ చౌహాన్ని ఫిక్స్ చేసుకునేసరికి అనుకున్నదానికంటే కాస్త ఆలస్యమైంది.
అయినా వచ్చిన నష్టమేమీ లేదు. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ కానిస్తున్నాడు ప్రవీణ్. హీరోయిన్ దొరికేలోపు నాగ్‌తో పాటు ఇతర పాత్రధారులపై చాలా సన్నివేశాలు షూట్ చేశాడు. ఇప్పుడు దుబాయ్‌లో ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. అక్కడ కొన్ని ఫైట్స్‌తో పాటు పాటలు కూడా తీయనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని కూడా వదిలారు. అవి చూస్తుంటే ఈ మూవీలో నాగ్ లుక్‌తో పాటు యాక్షన్ కూడా స్టైలిష్‌గా ఉండబోతోందని చెప్పిన విషయం నిజమే అనిపిస్తోంది.
నాగ్‌తో పాటు సోనాల్ కూడా అట్రాక్ట్ చేస్తోంది. వాళ్ల పెయిర్ కూడా బాగుంది. నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ కాస్త ఎక్కువ బడ్జెట్‌తోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని ఈ సంవత్సరమే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంటే ఈ యేడు నాగ్ నుంచి మూడు సినిమాలు వచ్చినట్టే. ఇక బిగ్‌బాస్ షో అడిషనల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాటే.