కింగ్ నాగార్జున తనయుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో గత కొంతకాలం నుంచి రిలేషన్ లో ఉన్న నాగచైతన్య.. ఆగస్టు 8న ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలే నిజం అయ్యాయి. నాగార్జున నివాసంలో ఈ రోజు ఉదయం 9:42 గంటలకు నాగచైతన్య, శోభితల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. `ఈ రోజు మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగింది. శోభితను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ హ్యాపీ కపుల్ కు జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను` అంటూ నాగార్జున ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.
దీంతో నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అక్కినేని అభిమానులు మరియు నెటిజన్లు వారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. కాగా, నాగ చైతన్య గతంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వీరు వివాహం చేసుకోగా.. 2021లో వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చైతు శోభితతో ప్రేమలో పడ్డాడు. దాదాపు రెండేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024