• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

స‌తీమ‌ణి కోసం సీఎం చంద్రబాబు స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఈసారైనా భువనమ్మకు న‌చ్చేనా..?

admin by admin
August 8, 2024
in Andhra, Politics
0
0
SHARES
83
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన సతీమణి భువనేశ్వరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ను కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఒక బహిరంగ సభలో భువనేశ్వరి మాట్లాడుతూ.. వివాహం తర్వాత చంద్రబాబు కేవలం ఒక్కసారి మాత్రమే తనకు చీరను కొనిచ్చారని.. కానీ ఆ చీర రంగు, నాణ్యత అస్సలు బాలేదని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నందున భార్య కోసం చంద్రబాబు షాపింగ్ చేసిన దాఖలాలు లేవని చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నంలో భువనేశ్వరి ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే అప్పటి భువనేశ్వరి మాటలు గుర్తుకొచ్చాయో ఏమో కానీ.. తాజాగా చంద్రబాబు స‌తీమ‌ణి కోసం రెండు చీరలను కొనుగోలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలజీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సీఎం త‌న చేతుల మీద‌గా ప్రారంభించారు. ఆపై ప్రతి స్టాల్ దగ్గరకు వెళ్లి చేనేత దుస్తులను ప‌రిశీలించారు.

ఈ క్ర‌మంలోనే రెండు చీర‌లు బాగా న‌చ్చ‌డంలో చంద్ర‌బాబు వాటిని కొనుగోలు చేసింది. భువనేశ్వరి కోసం వెంకటగిరి, ఉప్పాడ జాందాని చీరలను చంద్ర‌బాబు తీసుకున్నారు. ఆయా చేనేత చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపై డ‌బ్బులు ఇచ్చి వాటిని ప్యాక్ చేయించుకున్నారు. స్వ‌యంగా రాష్ట్ర‌ ముఖ్యమంత్రి తమవద్ద చీరలు కొనుగోలు చేయడంతో స‌ద‌రు చేనేత కార్మికులు ఆనందంలో మునిగిపోయారు. మ‌రోవైపు నెటిజ‌న్లు ఈసారైనా సీఎం గారు తెచ్చిన చీర‌లు భువనమ్మకు న‌చ్చుతాయో..లేదో.. అంటూ స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, చేనేత కార్మికులతో కాసేపు ముచ్చ‌టించిన అనంత‌రం చంద్ర‌బాబు అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో పాల్గొన్నారు. మన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు చాలా బాగున్నాయ‌ని.. అందుకే తన సతీమణికి రెండిటిని కొనుగోలు చేశానన్నారు. ఆడిటోరియంలో సుమారు 80కి పైగా స్టాల్స్‌లో ఉన్నాయ‌ని.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్ర‌బాబు భరోసా ఇవ్వ‌డంతో పాటు మగ్గానికి రూ.50వేలు, 200 యూనిట్ల విద్యుత్, జీఎస్టీ రద్దుతో సహా కొన్ని వ‌రాలు ప్ర‌క‌టించారు.

Tags: AP Newschandrababu naiducm chandrababuLatest newsnara bhuvaneshwariNational Handloom DaySareesTelugu News
Previous Post

రెండో పెళ్లికి సిద్ధ‌మైన నాగ చైత‌న్య‌.. నేడే శోభితతో ఎంగేజ్మెంట్..!

Next Post

వైభ‌వంగా నాగ‌చైత‌న్య‌-శోభిత నిశ్చితార్థం.. వైర‌ల్ గా మారిన ఫోటోలు!

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Andhra

ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
jagan
Andhra

మాది రైతు రాజ్యం: జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌

June 14, 2025
Load More
Next Post

వైభ‌వంగా నాగ‌చైత‌న్య‌-శోభిత నిశ్చితార్థం.. వైర‌ల్ గా మారిన ఫోటోలు!

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra