టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. గత కొంత కాలం నుంచి రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నాగార్జున నివాసంలో నేడు ఆగస్టు 8న శోభితతో నాగచైతన్య ఎంటేజ్మెంట్ జరగబోతోందని ప్రచారం జరుగుతోంది.
2017లో నాగ చైతన్య సౌత్ స్టార్ బ్యూటీ సమంతను మ్యారేజ్ చేసుకున్నాడు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గోవాలో చాలా గ్రాండ్ గా పెళ్లి పీటలెక్కారు. కానీ నాలుగేళ్లకే నాగ చైతన్య, సమంత తమ విడాకులను ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఇరువురు ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే నాగ చైతన్యకు ముంబైలోని ఓ ఈవెంట్ లో శోభిత పరిచయం అయింది. ఈ పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది.
నాగ చైతన్య, శోభిత లవ్ లో ఉన్నట్లు గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు నాగ చైతన్య, శోభిత తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నారట. నేడు కుటుంబ సభ్యుల నడుమ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోబోతున్నారని.. నాగార్జున ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎంగేజ్మెంట్ అనంతరం నాగార్జుననే స్వయంగా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.
కాగా, తెనాలిలోని తెలుగు కుటుంబంలో జన్మించిన శోభిత.. 2013 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. 2016లో రామన్ రాఘవ్ 2.0 మూవీతో శోభిత చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, ఆంగ్ల చిత్రాల్లో నటించింది. గూఢచారి సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆపై మేజర్ లో మెరిసింది. పొన్నియిన్ సెల్వన్ ద్వారా సౌత్ లో శోభిత భారీ క్రేజీ సంపాదించుకుంది.