అవును విజయవాడలో టీడీపీని ఇంటిపోరు దెబ్బతీసింది. విజయవాడ కార్పొరేషన్ లో వైసీపీ మెజారిటీ సీట్లు కొట్టేసింది. టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ముందంజలో ఉంది.
ఈ వార్త రాసే సమయానికి వైసీపీ 8, టీడీపీ 3 చోట్ల విజయం సాధించింది. ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ కైవసం. మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 43, టీడీపీ 6, జనసేన 1 చోట విజయం సాధించాయి.
విజయవాడలో చంద్రబాబు … మీ కోసం మీరు ఓట్లేసుకోండి. నాకోసం వేస్తారా అంటూ జనాల్ని తిట్టిన విషయమూ వైరల్ అయ్యింది. మరి సొంత నేతలు నానికి అడ్డుకట్ట వేశారా? లేక ప్రజలు చంద్రబాబు మాటతో హర్ట్ అయ్యారా అన్నది తెలియడం లేదు.