అట్లా ఉంటది మా జగన్ అన్న తో pic.twitter.com/vh682LKHt5
— త్రిజట స్వప్నం (@trijataswapnam) March 3, 2023
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందుకు తాజా ఉదాహరణగా జగన్ అంబానీ ఫోటోను చెప్పొచ్చు. రాజకీయ విశ్లేషకుల నోటినుంచి తరచూ వచ్చే.. ‘రాజకీయాల్లో శత్రువులు.. మిత్రులు శాశ్వితం కాదు’ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పాలి. నిజానికి ఇలాంటి ఫోటోను చూస్తామని పదేళ్ల క్రితం ఎవరైనా చెబితే.. మా జగనన్న మీద మీరెందుకు దుర్మార్గంగా ఆలోచిస్తారంటూ మండిపడిపోయేవారేమో?
తాను ప్రతిపక్షంలో ఉన్న వేళలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారణమని చెప్పటం.. అదేదో దరిద్రపుగొట్టు వెబ్ సైట్ లో వచ్చిన ఒక వార్త వైరల్ గా మారటం.. రాత్రికి రాత్రి రిలయన్స్ స్టోర్ల మీద వైసీపీ కార్యకర్తలు.. అభిమానులు.. సానుభూతులు దాడులు చేసే ప్రయత్నంచేయటం.. కొందరు ఆ విషయంలో అరెస్టు కావటం.. కేసులు నమోదు కావటం లాంటివి జరిగిపోయాయి.
నిజానికి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి కుట్ర జరిగిందని జగన్ మాత్రమే కాదు.. ఆయన తల్లి విజయమ్మ సైతం అందరి ముందే చెప్పేయటం చాలామందికి గుర్తుండే ఉండి ఉంటుంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హస్తం ఉందన్న మాట వినిపిస్తోందంటూ ఆమె.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో అనుమానాన్ని జనం మీద రుద్దటం తెలిసిందే. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదన్న దానికి తగ్గట్లే.. ఒకప్పుడు తన తండ్రి మరణానికి కారణమై ఉంటారన్న అనుమానాన్ని.. సందేహాన్ని వ్యక్తం చేసిన జగన్.. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ముకేశ్ అంబానీకి సన్నిహితంగా ఉండే పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభకు పంపుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.
ముకేశ్ అంబానీతో అలా మొదలైన అనుబంధం కొనసాగుతోంది. తాజాగా విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో.. వారి మధ్యనున్న అనుబంధం ఎంత బలీయమైనదన్న విషయం తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చూసినప్పుడు రాజకీయాలా? మజాకానా? అన్న భావన కలగటమే కాదు.. ఫ్లాష్ బ్యాక్ లో వైఎస్ జగన్ ఆవేదనతో చేసిన మాటల్ని ఎంత త్వరగా మర్చిపోయి.. అంత త్వరగా వర్తమానంలో జరుగుతున్న వాటిని మాత్రమే గుర్తుంచుకుంటేనే మంచిదన్న భావన కలుగక మానదు. కాదంటారా?
ఈ చెండాలం మీరు కూడా చూడండి.. pic.twitter.com/Ax99hJWrkz
— . (@MeeBidda) March 3, 2023