రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచపు ధనవంతుల్లో ఒకరు.
మరి అంత శ్రీమంతుడు సామాన్యులు కొనే కారు కొంటాడా?
సెమీ ధనవంతులు కొనే ఆడి, బీఎండబ్ల్లూులు కొంటాడా?
తన కోసం ప్రత్యేకంగా మోడిఫై చేయించుకున్న అల్ట్రా లగ్జరీ కారే కొన్నాడు.
ఆ కారు… Rolls Royce Cullinan
దాని ధర 13 కోట్ల 14 లక్షల రూపాయలు.
ఇది పెట్రోలు కారు.
జనవరి 31న దక్షిణ ముంబైలోని టార్డియో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో RIL పేరిట దీనిని రిజిస్టర్ చేశారు.
2018లో విడుదలైన ఈ లగ్జరీ SUV ధర 6.75 కోట్లు కాగా మరో 7 కోట్లు పెట్టి దానిని మోడిఫై చేయించుకున్నారు ముఖేష్ అంబానీ.
ఈ కారు మీద వేసిన ట్యాక్సుతోనే ఒక కారు కొనుక్కోవచ్చు. ఈ కారు కోసం కట్టిన ట్యాక్స్ రూ. 20 లక్షలు.
ఇది ప్రస్తుతం దేశంలోనే అతి ఖరీదైన కారుగా ముంబై రవాణా అధికారి వెల్లడించారు.
ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు.