అనుకున్నట్లే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు రియాక్టు అయ్యారు. చిత్ర పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు నిర్మాతలు కాదంటూ ఏపీ సర్కారుపై ఫైర్ అయ్యారు. చిత్ర పరిశ్రమలోని వారంతా ఒక్కటిగా తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒక సుదీర్ఘ లేఖ రాశారు. దీన్ని ట్వీట్ తో పంచుకున్నారు. ఇప్పుడీ లేఖలోని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అందులో మోహన్ బాబు ఏమని పేర్కొన్నారంటే..
‘మనకెందుకు.. మనకెందుకు అని మౌనంగా ఉండాలా? నా మౌనం చేతకానితనం కాదు. చేవలేనితనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. ‘నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయి.. కఠినంగా ఉంటాయి. కానీ, నిజాలే ఉంటాయి. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా’ అని అన్నారు’
‘అంటే వాళ్ళు చెప్పినట్టు బతకాలా? నాకు నచ్చినట్టు బతకాలా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్టిబ్యూటర్స్ కాదు. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు. కొన్ని వేల జీవితాలు’
‘47 ఏళ్ల అనుభవంతో చెబుతున్న మాట. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమవ్వాలి. సమస్యలు ఏంటి? పరిష్కారాలు ఏంటి? ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుందనేది చర్చించుకోవాలి’
‘ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది?’
‘మళ్లీమళ్లీ చెబుతున్నా, సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానం. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్లి సమస్యల్ని వివరిస్తే మనకీ రోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు’
‘సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్లు ఉండొచ్చు.. లేదా వేరు వేరు పార్టీల వాళ్లు ఉండొచ్చు అది వాళ్ల ఇష్టం.. కాదనను. కానీ, ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి. వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మన కష్టసుఖాలు చెప్పుకోవాలి! అలా జరిగిందా? జరగలేదు’
‘నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్ని కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిగారిని కలిసి ‘పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి భిక్ష పెట్టండి’ అనగానే.. ఆ మాట చాలామందికి నచ్చలేదు. కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది.. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం’
‘రూ.300.. రూ.350 టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. రూ.50.. రూ.30లతో టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలకు నష్టం. చిన్న సినిమాలు ఆడాలి. పెద్ద సినిమాలు ఆడాలి. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి ‘అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది. చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం’
‘సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్ ఉన్నాయి. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు. కానీ, ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం’ అని పేర్కొన్నారు.
అయితే, మోహన్ బాబు అదే పనిగా సినిమా వాళ్లని టార్గెట్ చేసిన జగన్ ని ఏమీ అనకుండా తప్పు చేసిన వ్యక్తి వద్దకు వెళ్లి బతిమాలుకుందాం అంటూ అర్థం వచ్చేలా రాసిన ఈ లేఖపై సర్వ సినీ అభిమానగణం మండిపడుతోంది. ఈ మాత్రం కూడా ధైర్యం లేకపోతే మీ ఇంట్లో ఆ పదవి ఎందుకు అని ప్రశ్నించే పరిస్థితి.
నెటిజన్ల రియాక్షన్లు చూస్తే ఇలా ఉన్నాయి.
ఫైనల్ గా @themohanbabu గారు చెప్పొచ్చేదేంటంటే ..
పవన్ కళ్యాణ్ గారు : అడుక్కోకండి అది మీ హక్కు
మోహన్ బాబు : రండి అందరం కలిసి వెళ్ళి జగన్ ని మనకి భిక్ష పెట్టమని అడుక్కుందాం
అదీగా మ్యాటర్ సర్..@PawanKalyan అంతేగా అన్న
— Bramham (@Bramhamgaddam) January 2, 2022
మోహన్ బాబు గారు చెప్పింది 100% కరెక్ట్ సినిమా అంటే పరిశ్రమ నలుగురు హీరోలో డైరెక్టర్లు కాదు కానీ""MAA""అధ్యక్షుడుగా ఎన్నికైన మీ పుత్రరత్నం నోరు మూసుకొని ఇంట్లో కూర్చునుంటే ఏమి చెయ్యాలో కూడా చెప్పితే బాగుంటుంది అయినా దొంగపడ్డ ఆరునెలలకు కుక్క మొరిగింది అన్నట్లు ఇప్పటివరకు ఏమిచేశారు
— నూకల వెంకట సత్యనారాయణ రావు (@Narayanaraonook) January 2, 2022
@themohanbabu నువ్వు ఈ జన్మ లో మరవ్. మారుతవ్ అని కూడా అనుకోవాల్సి నా పని లేదు. నువ్ నిజం గా మనిచివ లేదా మోహన్‌బాబు వ
— VADLAPATI BHARGAV. (@bhargavvadlapa1) January 2, 2022
మాయ్యా మోహన్ బాబు, మన ముద్రగడ మాయ్యా పంచిన పువ్వులు ఉన్న టెంకాయలు తిని, ఇక నువ్వే ఇండస్ట్రీ పెద్ద అని ఫిక్స్ అయిపో, నీ ఆప్త శత్రువు అనుకునే చిరంజీవి గారు కూడా నేను పెద్ద కాదు అన్నాడు గా! @ysjagan మీ బంధువు ఏ గా, మా ప్రెసిడెంట్ నీ కొడుకే గా,పెద్ద నువ్వే, ఇండస్ట్రీ ని బాగుపరుచు! https://t.co/2Uw8i3suzM
— ఓం శివోహం! (@ShivanaveenJSP) January 2, 2022
తెలుగు సినిమా ఇ౦డస్టీ టికెట్టు సమస్యలు కారణం ఇప్పుడు ప్రజలకు అర్ధం అవుతోంది ఇది మొత్తం మోహన్ బాబు, జగన్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం అని కాని ఇప్పటికీ మోహన్ బాబు నాటకం బయటపడింది వాహ్ నక్క వినయాల త౦డ్రి కోడుకులు ఏమి డ్రామాలాడుతున్నారు రా. కాలం మిమ్మల్ని క్షమించదు
— Reddi UMA MAHESWARA RAO (@Nehasai05) January 2, 2022
అలా స్క్రోల్ చేస్తుంటే రెండూ ఓకే ఫ్రేమ్ లో దొరికాయి.
టైమింగ్ చూస్తే
చిరంజీవి తప్పుకున్నాక మోహన్ బాబు ముందుకొచ్చినట్టు కనిపిస్తోంది. pic.twitter.com/w9eF9Elg4t— ????????$H∆M€€R???????? (@bashashameer10) January 2, 2022
మీరందరూ వెళ్ళి మోహన్ బాబు గారి దగ్గర చేతులు కట్టుకుంటే ఆయన వెళ్లి జగన్ గారి కాళ్ళు పట్టుకుంటారు. https://t.co/bpRFr0ntuJ
— గమ్యం లేని ప్రయాణం (@sagar_javvadi) January 2, 2022