• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వాడుకొని వదిలేశారు..జగన్ పై మోహన్ బాబు హాట్ కామెంట్స్ ?

admin by admin
March 20, 2022
in Andhra, Movies, Politics, Top Stories, Trending
0
0
SHARES
241
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇటీవలి కాలంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణుల పేర్లు పలు వివాదాల్లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను వ్యవహారంలో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ బీసీ సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఇంతవరకు మోహన్ బాబుగానీ, విష్ణుగానీ ఆ విషయంపై స్పందించకపోగా…క్షమాపణలు చెప్పలేదు.

ఇక, జగన్ తో సినీ ప్రముఖుల భేటీకి తనకు ఆహ్వానం అందకుండా చేశారని, సన్నాఫ్ ఇండియా చిత్రంపై నెగెటివ్ ట్రోలింగ్ చేశారని, తనపై ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు కుట్ర చేస్తున్నారని మోహన్ బాబు ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన జన్మదిన వేడుకల సందర్భంగా మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఎంతోమందికి ఉపయోగపడ్డానని, కానీ, తనకు మాత్రం ఎవరూ ఉపయోగపడలేదని మోహన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఎంతోమంది ఎన్నికల ప్రచారం చేయించుకున్నారని, కానీ, తనకు మాత్రం ఎవరూ ఏమీ చేయలేదని పలువరు రాజకీయ నాయకులనుద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను ఎన్నో రకాలుగా మోసపోయానని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.

జీవితమంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోందని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో శ్రమ ఉందని మోహన్‌బాబు అన్నారు. ఈ వేడుకల్లో ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జీఏఆర్ గ్రూప్స్ అధినేత అమరనాథ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

మోహన్‌బాబు త్వరలో ప్రారంభించబోయే యాక్టింగ్ స్కూలుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని పండిట్ రవిశంకర్ ఆకాంక్షించారు. మోహన్‌బాబు ముక్కుసూటి మనిషని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. అయితే, దాని వల్ల ఆయన ఎన్నో కోల్పోయారని అయితే, మరికొన్నింటిని మాత్రం ఆయన సంపాదించుకున్నారని అన్నారు. దీంతో, మోహన్ బాబు కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. జగన్ ను ఉద్దేశించే ఆయన ఈ రకంగా ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

Tags: actor mohan babuemotional commentsmohan babu's birth daypolitical careerpoliticians used mesri vidyanikethan
Previous Post

యూరప్ లో టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలు-40+ నగరాల్లో!

Next Post

జాతిర‌త్నాలు ద‌ర్శ‌కుడితో వెంకీ?

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

జాతిర‌త్నాలు ద‌ర్శ‌కుడితో వెంకీ?

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra