ప్రధానమంత్రి పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే వేసింది. పంజాబ్ పర్యటనలో ఒక ఫ్లైఓవర్ దగ్గర ఆందోళనకారులు వెహికల్స్ ను పెట్టి మోడి కాన్వాయ్ ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులను దాటుకుని ముందుకెళ్ళే అవకాశాలు లేకపోవటంతో మోడి తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇపుడా ఘటనకే సెంటిమెంటును రంగరించి ఎన్నికల్లో లబ్దిపొందాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
తనను తాను మార్కెటింగ్ చేసుకోవటంలో నరేంద్రమోడిది అందెవేసిన చేయని అందరికీ తెలిసిందే. దేశంలోని అన్నీ ఆలయాల్లో మోడీ పేరుతో మృత్యుంజయ హోమాలను చేయించటంలో కమలనాదులు బిజీ అయిపోయారు. మృత్యుంజయ హోమం అన్నది తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారికోసం, లేదా భవిష్యత్తులో ప్రాణగండం ఉందని జ్యోతిష్కులు చెప్పినపుడు మాత్రమే మృత్యుంజయ హోమం, జపం చేయిస్తారు. కానీ ఇపుడు మోడీ పేరుతో మృత్యుంజయ హోమాలు మొదలుపెట్టడంలో అర్దమేంటి ?
చేయించే హోమాన్ని లేదా జపాన్ని గుట్టుగా ఇంట్లోనో లేదా దేవాలయంలోనో చేయిస్తారు. కానీ ఇక్కడ మోడీ భక్తులు మాత్రం బాహాటంగా దేశంలోని చాలా దేవాలయాల్లో అదేపనిగా చేయిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోడీకి ఎవరినుండి ప్రాణగండం లేదు. ప్రాణగండం ఉందని కానీ టెర్రరిస్టుల నుండి హెచ్చరికలు కూడా ఏమీలేవు. మోడి మీద ఎవరూ ఎటాక్ కూడా చేయలేదు. పంజాబ్ లో రోడ్డుమార్గంలో ఆందోళనకారులు అడ్డుకున్నది కూడా మోడీని కాదు.
ఫ్లైఓవర్ మీద ఆందోళన చేసినవాళ్ళకసలు ఫ్లైఓవర్ మీదకు మోడీ వస్తున్నట్లు కూడా తెలీదు. అప్పటికేదో తనపై పెద్ద దాడి జరగటానికి ఎవరో ప్లాన్ చేసినట్లు ఆ దాడినుండి తాను తృటిలో తప్పించుకున్నట్లు మోడీ బిల్డప్ ఇస్తున్నారు. తనను ప్రాణాలతో వెళ్ళనిచ్చినందుకు థ్యాంక్స్ అంటు పంజాబ్ సీఎంను ఉద్దేశించి చేసిన ట్వీటే మోడీ ఓవర్ యాక్షన్ కు నిదర్శనం. పంజాబ్ పర్యటనలో మోడీపై దాడి అన్న విషయమే అసంబద్ధం.
అయినా ప్రధానిని చంపటానికి పంజాబ్ లో కుట్ర జరిగిందని కేంద్రమంత్రులు చెప్పేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం ఇలాగుంటే గాంధీ విగ్రహాల దగ్గర దేశమంతా నిరసనలు వ్యక్తంచేయాలని బీజేపీ డిసైడ్ చేసింది. మొత్తానికి జరిగిన ఘటన నుండి ఎంతగా లబ్దిపొందేందుకు మోడీ భక్తులు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తన్నారో అర్ధమైపోతోంది.