• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేసీయార్ పెద్ద స్కెచ్చే వేశారా ?

admin by admin
January 9, 2022
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
394
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చూస్తుంటే కేసీయార్ లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ ప్రతిరోజు ఏదో ఒక కారణంతో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ మరీ దూకుడుమీదుంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అంటు బీజేపీ నేతలు చేస్తున్న హడావుడి చాలా ఎక్కువగా ఉంది. నిజంగానే అధికారంలోకి వచ్చేస్తారా లేదా అన్నది ఇపుడే చెప్పలేకపోయినా వాళ్ళ హడావుడిని తట్టుకోవటం మాత్రం కేసీయార్ కు కష్టంగానే ఉంది.

కేంద్రంలో అధికారంలో ఉండటం, అందులోను చాలా బలంగా ఉండటంతో రాష్ట్రంలో కమలనాదులను తట్టుకోవటం కష్టంగానే ఉంది. అందులోను బీజేపీ సారధి బండి సంజయ్ స్వతహాగానే బాగా దూకుడుమనిషి. దానికితోడు కేంద్రంలోని పెద్దల మద్దతు కూడా నూరుశాతం ఉండటం, రాష్ట్రంలో అందరి సహకారం సంపూర్ణంగా అందుతుండటంతో ప్రతి విషయంలో కేసీయార్ ను ఢీ కొడుతున్నారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నట్లున్నారు కేసీయార్ అందుకనే వామపక్షాలతో సంబంధాలు కలుపుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే కేరళా సీఎం పినరయి విజయన్ తో పాటు  సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులకు భారీ విందిచ్చారు.

వామపక్షాల నేతలకు విందు ఇవ్వటం  కేసీయార్ తత్వానికే విరుద్ధం. ఎందుకంటే అపాయిట్మెంట్ ఇవ్వమంటేనే సాధ్యం కాదని చెప్పిన వ్యక్తి కేసీయార్. అలాంటిది పిలిచి విందు ఇచ్చారంటే దానివెనుక పెద్ద స్కెచ్ ఉందనే అనుకోవాలి.

తాజా విందు రాజకీయాలతో వామపక్షాలతో పొత్తులకు కేసీయార్ రెడీ అయినట్లే ప్రచారం ఊపందుకుంది. గతంలో కూడా వామపక్షాలతో కలిసి పనిచేసిన రోజులున్నాయి. అయితే విడిపోయిన తర్వాత మళ్ళీ వామపక్షాలను కేసీయార్ దగ్గరకు రానీయలేదు. బీజేపీపై పోరాడటానికి తెలంగాణాలోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల అవసరం చాలా ఉందని కేసీయార్ ఫీలవుతున్నట్లున్నారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో వామపక్షాలకు ఇప్పటికీ కొంత బలముంది. వాళ్ళు సొంతంగా సీట్లు గెలుచుకోలేకపోయినా ప్రత్యర్ధుల ఓటమికి కారణమవ్వగలరు. అందుకనే వచ్చే ఎన్నికల్లో వామపక్షాలకున్న ఓట్లను కూడా తనకు అనుకూలంగా మలచుకునేందుకు కేసీయార్ వ్యూహం రచించినట్లు తెలుస్తొంది. పైగా తెలంగాణాలో పెట్టుకునే పొత్తులు జాతీయస్ధాయిలో కూడా కేసీయార్ కు ఉపయోగపడే అవకాశాలున్నాయి. మొత్తం మీద బీజేపీ, కాంగ్రెస్ లు కేసీయార్ ను బాగానే టెన్షన్ పెట్టేస్తున్నాయి.

Tags: bandi sanjayBJPCongressKCRrevanth reddyTelanganaTRS
Previous Post

అమెరికాలో షాకింగ్ ట్విస్టు ఇచ్చిన ఒమిక్రాన్

Next Post

మోడీ..మరీ ఓవర్ గా లేదూ

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post
narendra modi

మోడీ..మరీ ఓవర్ గా లేదూ

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra