ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. ఇటీవల బహిరంగ వేదికపైనే కన్నీరు పెట్టుకోవడం తెలిసిందే. మహారా ష్ట్రలో జరిగిన పీఎం ఆవాస్ యోజన గృహాలను లబ్ది దారులకు అందిస్తూ.. “ఇలాంటి ఇళ్లు నా చిన్నత నంలో ఉండి ఉంటే“ అని వ్యాఖ్యానిస్తూనే కన్నీటి పర్యంత మయ్యారు. ఈ వార్త.. ఖండాంత రాలుదాటి పోయి.. అమెరికాలోనూ చర్చకు వచ్చింది. మోడీ ఎందుకు ఏడ్చారు? అంటూ.. ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు తెగవెతికేసి.. తెలుసుకున్నారు. కాగా ఈ కన్నీటికి కారణం.. బాధతో కూడిన ఆనందం.
ఇక, ఇప్పుడు అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన వేళ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటి పర్యం తమయ్యారు. అయితే.. ఇది ఎక్కడా బహిరంగ వేదికలపై కాకుండా.. తన రూంలోనే జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. `నా కళ్లు చమర్చాయి. గుండెలు సుడిగుండాలవుతున్నా.. నన్ను నేను తమాయించుకున్నా“ అని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఈ కన్నీటికి కారణం.. సంతోషంతో కూడిన ఉద్వేగం!!
ఏం జరిగింది?
మంచికైనా చెడుకైనా.. కన్నీళ్లు వచ్చేస్తాయి. అదేవిధంగా తాజాగా అయోధ్య విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కష్టించారని పేర్కొంటూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆయనకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో మోడీ ఎంత కష్టపడ్డారో.. వివరించారు. ఇది చదువుకున్న మోడీ.. ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఆనందం.. ఉద్వేగం రెండూ కలిసిపోయి.. కన్నీటి రూపంలో ఆయన కనుల నుంచి జాలువారిందన్న మాట.
‘బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని పెంపొందిస్తుంది. భారతదేశ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుంది అని’ ప్రధాని మోడీ పేర్కొన్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధానికి ముర్ము రాసిన లేఖలో మోడీ చేసిన 11 రోజుల అనుష్ఠాన దీక్ష, రాముని పట్ల ఆయనకు ఉన్న భక్తిని వివరించారు. వీటిని చదువుతూ.. తాను కన్నీటి పర్యంతమైనట్టు మోడీ పేర్కొనడం గమనార్హం.