ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అప్పులు…వాటికోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఖజానాలోటును భర్తీ చేయాలనుకున్న జగన్ కు బ్యాంకర్లు హ్యాండ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ఏపీలో అప్పుల వ్యవహారంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు కేంద్రం సంచలన ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ అప్పులపై ప్రధాని మోదీ కూడా తాజాగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో అసలేం జరుగుతోందని, లక్షల కోట్ల అప్పులు చేయడమేమిటని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఏపీని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా అందినకాడికి అప్పులు చేస్తే దేశం ఏమైపోతుందని మోదీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా కుప్పకూలిపోతామని, ఈ పరిస్థితిని సహించవద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు మోదీ సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త అప్పుల కోసం హస్తినాపురికి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రికి రిక్త హస్తాలు చూపిస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా మరో రూ.45,000 కోట్ల అప్పు కోసం ఏపీ సర్కార్ తిప్పలు పడుతోంది. ఇఖ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన బుగ్గన రూ.45వేల కోట్లు అప్పు కావాలని విన్నపాలు చేసినా ఫలితం దక్కలేదట. కొత్త అప్పు మాటెత్తొద్దని, రాష్ట్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఉల్లంఘిస్తున్న తీరును ఆమె వివరించారట. అక్రమ పద్ధతుల్లో చేసిన పాత అప్పులకూ లెక్క చెప్పాలని, ఏపీఎ్‌సడీసీ ద్వారా తెచ్చిన రూ.21,500 కోట్ల అప్పులనూ ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రం ఆర్థికంగా రెండు నెలలకంటే ఎక్కువగా నిలబడలేదని నిర్మలమ్య వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కొత్తగా అప్పులు పుట్టకపోవడంతో… ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లా? లేదా పథకాలా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుస్తోంది. మరి, ఏపీ అప్పుల బండిని జగన్ ఎంతకాలం నెట్టుకొస్తారో వేచి చూడాలి.