రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో శాసన మండలిలో స్థానిక సంస్థలు, పట్టభద్రులకు చెందిన అభ్యర్థులను ఎన్నికునే ప్రక్రియ సాగు తోంది. అయితే.. చాలా వరకు స్థానాల్లో వైసీపీ నుంచి ఏకగ్రీవాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఇక, వివిధ కారణాలతో అధికారులు వాటిని తొలగిస్తున్నారని కూడా నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు.. రాయలసీమ జిల్లాల్లో ఏకగ్రీవాలు ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
అయితే.. ఎటొచ్చీ.. కీలకమైన ఉత్తరాంధ్రలో మాత్రం ఏకగ్రీవాలకు ఛాన్స్ లేకుండా పోయిందని తెలుస్తోం ది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికకు ఈ దఫా భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకవైపు.. వైసీపీ విశాఖనుపాలనా కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నదరిమిలా..త
దీంతో ఇక్కడ ఇతర స్థానాలకంటే కూడా.. 44 నామినేషన్లు పడడం గమనార్హం. ఇక, దాఖలైన నామినేషన్ పత్రాల్లో నాలుగు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. 40 నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని అధికారులు ఆమోదించకతప్పలేదు. 44 మంది అభ్యర్థులు 70 సెట్ల నామపత్రాలు దాఖలు చేయగా, వాటిలో విశాఖ జిల్లాకు చెందిన ఇమామ్ మోహియుద్దీన్ అహ్మద్, రుద్రరాజు కల్యాణ్ వర్మ ఉన్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన బొలిశెట్టి వెంకటేశ్వరరావు, అనకాపల్లి జిల్లాకు చెందిన కొలుపురి నాగభారతి నామపత్రాలు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అయితే.. ఇప్పుడు 40 వరకు నామినేషన్ పత్రాలు అర్హత పొందిన నేపథ్యంలో పోటీ అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. పట్టభద్రులు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అధికార పార్టీ నేతల్లో కలవరం ప్రారంభమైంది.