ప్రజలు వస్తున్నారు పారిపో జగన్ !!#HelloAP_ByeByeYCP#VarahiVijayaYatra pic.twitter.com/p8tUEHrmHY
— JanaSena Party (@JanaSenaParty) August 14, 2023
భూములు ఆక్రమణలు, కబ్జాలు వంటి విషయంలో మంత్రులది తప్పు కాదని.. ఈ విషయంలో ముఖ్యమం త్రి జగన్‌దే తప్పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో వారాహి 3.0 యాత్ర చేస్తున్న పవన్.. విస్సన్న పేట భూముల్లో జరిగిన ఆక్రమణలు, కబ్జాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ..
అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వాల్టా చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోవ డం లేదని అన్నారు. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. కేవలం ఉత్తరాంధ్ర భూముల మీదే ప్రేమ అని వ్యాఖ్యానించారు. పర్యావరణ విఘాతం కలిగిందన్నారు. ఈ ఉరిలోకి రావడానికి ఇరుకు రోడ్ ఉందని.. కానీ, అధికార పార్టీ నేతల రియల్ ఎస్టేట్‌కు మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని మండిపడ్డారు.
‘‘మంత్రి గుడివాడ అమర్నాథ్ కాదు.. నేను సీఎంనే అడుగుతున్నాను. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం’’ అని పవన్ చెలరేగిపోయారు. కొండలను పిండి చేశారని.. ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విసన్న పేట భూములు మీద కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రీన్ ట్రిబ్యునల్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పవన్ చెప్పారు.
ఇక, రాష్ట్రంలో యువతకు ఉపాది లేదని.. జాబ్ క్యాలెండర్ లేదని పవన్ మండిపడ్డారు. ఇప్పటికి నాలుగే ళ్లు పూర్తయ్యాయని.. కనీసం ఒక్కసారికూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని రాష్ట్రంలో నిరుద్యోగిత పెరుగు తోందని అన్నారు. జగన్‌కు ఆయన పరివార సభ్యులకు మాత్రమే పదవులు దక్కాయని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ జగన్‌ను అధికారంలోకి రానిచ్చేది లేదన్నారు.