ఏపీ మంత్రులకు…పోలీసులు ఏవిదంగా సహకరిస్తున్నారో.. వెల్లడించే స్పష్టమైన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సహకరించకూడదని ఎవరూ అనడం లేదు. కానీ చట్టాన్ని,నిబంధనలను కూడా పక్కన పెట్టి.. పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించడం.. ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వంటివే ఇప్పుడు చర్చకు దారిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది.
ఈ జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇదేం ఖర్మ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగానేరుగా మంత్రే రంగంలోకి దిగిపోయి..తనప్రొటోకాల్ను కూడా పక్క న పెట్టి రోడ్డెక్కి.. చొక్కా చింపుకుని.. నానా యాగీ చేశారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడం.. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు.
అయితే.. అక్కడ స్పాట్లో పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా.. ఏమయ్యారు? అనేచర్చ సహజంగానే తెరమీదికి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే.. స్పాట్లో పోలీసులు ఉన్నారు. భారీ ఎత్తున మోహరించారు. కానీ, వీరంతా.. మంత్రి కనుసన్నల్లోనే పనిచేశారు. ఆయన చెప్పినట్టు.. ఆయనకు వారు చెప్పినట్టు పరస్పరం సహకరించుకు న్నారు.
చంద్రబాబు ఎటువైపు నుంచి వస్తున్నారు..? ఎలాదాడి చేయాలి? ఎలా నిలువరించాలి? వంటి విషయా లపై పూసగుచ్చినట్టు మంత్రి పోలీసులకు వివరించడం.. ఆయన చెప్పిన దానికి పోలీసులు సరేననడం.. మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్ రెండు చేతులూ ఎత్తి పోలీసులకు నమస్కరించడం.. అన్నీ కూడా.. స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Minister Suresh explaining to the police about the scene of stone attack on Chandrababu in Erragondapalem. The police officer says ok sir…….
Everything is a pre-planned attack….
Is the government law and order in their hands?…….@nsgblackcats @PMOIndia @HMOIndia pic.twitter.com/a3SCeKdHVm
— ???? (@TEAM_CBN1) April 22, 2023