మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జ్యోష్‌లో దూసుకుపోతున్నారు. కొద్ది రోజుల క్రితమే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రాన్ని పూర్తి చేసిన ఈయన.. ఆ వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`ను స్టార్ట్ చేశాడు. ఇది ఇంకా ఫినిష్ అవ్వకముందే మెహర్ రమేష్‌తో `భోళా శంకర్`, బాబీ డైరెక్షన్లో `మెగా 154` చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
వీటిల్లో `మెగా 154`పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చిరంజీవి అల్ట్రా మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రను పోషించబోతున్నారని, ఆయన పాత్ర దాదాపు నలబై నిమిషాల పాటు ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. దాని ప్రకారం.. మెగాస్టార్‌కు మాస్ హీరో తోడయ్యేది ఏప్రిల్ నుంచే అట. చిరంజీవితో రవితేజ ఏప్రిల్ నెల నుంచీ షూట్ లో జాయిన్ కానున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, చిరంజీవి, రవితేజ గతంలో ఆజ్ కా గూండారాజ్, అన్నయ్య, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని టాక్ నడుస్తుండటంతో.. అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు.