పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా ఒంటరిపోరుకు సిద్ధమయ్యారని, గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు మధ్య ఆయన బలం పుంజుకుందని ఇటీవల కాలంలో విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇటీవల విజయనగరం జిల్లాలో పవన్ పర్యటించారు కూడా. ఈ సందర్భంగా ఆయన ఒక్క ఛాన్స్ తనకు ఇవ్వాలం టూ పిలుపునిచ్చారు. కట్ చేస్తే ఒక్క ఛాన్స్ వెనుక ఏం ఉంది? అంటే, పవన్ ఒంటరి పోరుఉందనే సంకేతాలుజనసేన నేతలు చెబుతున్నారు.
బీజేపీ, కలిసినా కలవకున్నా వేరే సంగతి. పవన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు రెడీగా లేరనే సంకేతాలు వచ్చేసినట్టు అయింది. అయితే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే తెరవెనుక, చిరంజీవి.. పవన్‌కు సపోర్టు చేస్తున్నారనేది తాజాగా వెల్లడైంది. వాస్తవానికి ఇప్పటికే మెగా అభిమానులు, అటు చెర్రీ అభిమానులు కూడా రెండు దఫాలుగా భేటీ అయి పవన్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.
అయితే, ఎలా? ఏంటి? అనేదానిపై ఇంకా వారు క్లారిటీకి రాలేదు. ఇంతలో పవన్‌ను తాను ఉన్నతస్థా నంలో చూస్తానని చిరు వ్యాఖ్యానించడం.. మెగా అభిమానుల్లో మరింత క్రేజ్ పెంచింది. ఎందుకంటే, ఇప్పటి వరకు చిరు మౌనంగా ఉన్నారు. గతంలో ఒక్కసారి మాత్రమే పవన్ గురించి ప్రస్తావించిన ఆయన తాజాగా ఎలాంటి సందర్భం లేకుండానే పవన్ విషయంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది అభిమానులకు బూస్ట్ ఇచ్చినట్టు అయింది.
అయితే, దీనిని అందిపుచ్చుకుని పవన్ ముందుకు సాగుతారా? లేదా? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే, గత ఎన్నికలకు ముందు కూడా చెర్రీ వచ్చి ప్రచారం చేస్తానంటే వద్దన పవన్, ఇప్పుడు మాత్రం ఆహ్వానిస్తారా? అనేది చూడాలి. ఏదేమైనా మెగా అభిమానులను దూరం చేసుకుంటే కష్టమేనని, వారిని చేరువ చేసుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.