పాపం మరణం తర్వాత కూడా వైఎస్ ని ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు ఆయన కుటుంబం. వాళ్ల కుటుంబ సభ్యుడే కాబట్టి వాడుకుంటే వాడుకుంటారు అనుకుందాం. కానీ ఆయన పై వేసిన నిందలను మాత్రం వీళ్లు మోసుకోరు, కానీ ఆయన చేసిన రెండు మూడు మంచిపనులకు క్రెడిట్ తీసుకోవడానికి మాత్రం ఎగేసుకుంటూ వస్తారు.
కేసీఆర్ … వైఎస్సార్ ని ఇటీవలే బాగా తిట్టాడు… షర్మిల గాని, విజయమ్మ గాని, జగన్ గాని స్పందించలేదు. కానీ రాజకీయంగా ఆయన బొమ్మ ఉపయోగపడుతుంది అంటే ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోరు.
తాజాగా అటు ఆంధ్రాని కొడుకు చేతిలో పెట్టిన విజయమ్మ తెలంగాణని కూతురు చేతిలో పెట్టేందుకు పెద్ద ప్లానే వేసింది. ఆంధ్రా వాళ్లంటే కాస్త గవర్నమెంటు సొమ్ము తినడానికి ఆశపడటంలో ముందుంటారు కాబట్టి వీరు చెప్పిందల్లా నమ్మారు, పైగా అక్కడ పావు శాతం జనాభాను క్రిస్టియన్లుగా మార్చేసి ఓట్ల కోసం బైబిల్ తో ఒట్టేయించారు. అవే ప్లాన్లు ఇక్కడ వర్కవుటవ్వాలంటే చెల్లవు కదా.
కానీ మొండి ఘటాలు. విజయం గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు ప్రయత్నం చేద్దాం అని పట్టుదల పెట్టుకోవడంలో జగన్, షర్మిల ఎవరికి వారే సాటి. మేము ఎన్నితప్పులు చేసినా జనానికి ఇంత పడేస్తే చాలు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన కుటుంబం.
తాజాగా తెలంగాణలో కూతుర్ని బలపరచడానికి విజయమ్మ మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందేగా. దానికి ఎవరు వచ్చారో తెలుసా.
✅ వైఎస్ విజయమ్మ ఆహ్వానం మేరకు మాజీ IASలు, మాజీ IPSలు, కొందరు సీనియర్ జర్నలిస్ట్‌లు, పారిశ్రామికవేత్తలు సైతం హైటెక్స్‌కు వచ్చారు. సంస్మరణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని వైఎస్ విజయమ్మ, షర్మిల మర్యాదపూర్వకంగా పలకరించారు.
✅ముఖ్యంగా YSRతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన వాళ్లలో ఏపీ కాంగ్రెస్‌కు చెందిన KVP రామచందర్‌రావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్ అటెండ్ అయ్యారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు గోనె ప్రకాష్, BJP నేత కూన శ్రీశైలం గౌడ్, కంతేటి సత్యనారాయణ రాజు, రామచంద్రమూర్తి, మాజీ DGP దినేష్ రెడ్డి, రిటైర్డ్ IPS ప్రభాకర్ రెడ్డితో పాటు శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, DV సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు. ఏబీకే ప్రసాద్, బండారు శ్రీనివాస్, జంధ్యాల రవి శంకర్ , మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంస్మరణ సభకు విచ్చేశారు. వీళ్లతో పాటు రాజీవ్ త్రివేది, గిరీష్ సంగ్వి , నవయుగ సీవీ రావు, Ap జితేందర్ రెడ్డి, బ్రదర్ అనీల్‌కుమార్ సభకు విచ్చేశారు.
✅కాంగ్రెస్ నేతలు ఎవరూ వెళ్లొద్దని ఇప్పటికే TPCC స్పష్టం చేసినప్పటికి .. కొందరు కాంగ్రెస్ నేతలు సభకు హాజరయ్యారు. వెళితే తప్పేంటని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రశ్నించారు.