రాయలసీమ కరవు ప్రాంతమే అయినా… కాలక్రమేణా సస్యశ్యామలం అవుతోంది. ముందు నుంచి తుంగుభద్ర వల్ల కర్నూలులో అధిక భాగం సాగులోకి వచ్చింది. అయితే, చిత్తూరులో నీటి వనరులు సగం జిల్లాకు బాగానే ఉన్నాయి. ఎన్టీఆర్ మొదలుపెట్టిన హంద్రీనీవా పథకాన్ని వైఎస్ కొంతవరకు ముందుకు తీసుకెళ్లగా చంద్రబాబు దానిని చాలావరకు పూర్తిచేశారు. దీంతో రాయలసీమలో పచ్చటి పొలాలు కనువిందు చేస్తున్నాయి.
అనంతపురంలో 1999లో చంద్రబాబు నీటి వనరుల సద్వినియోగంలో చంద్రబాబు తీసుకువచ్చిన సంస్కరణలు ఎంతో ఉత్తమఫలితాలను ఇచ్చాయి. అప్పట్లో బోర్ల మీద ఆధారపడే అనంతపురం వ్యవసాయాన్ని డ్రిప్ మీదకు మరలేలా చంద్రబాబు ప్రోత్సహించారు. భారీగా సబ్సిడీలు ఇచ్చారు. ఎపుడైతే డ్రిప్ మీదకు వ్యవసాయం మారిందో పంటలు కూడా మారాయి.
విజన్ 2020 కింద అనంతపురం స్వరూపమే మారిపోయింది. కొద్దిరోజుల క్రితం అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు వేశారు. ఎందుకో తెలుసా… 1999లో మొదలుపెట్టిన డ్రిప్ ఇరిగేషన్ విధానం మెల్లగా జిల్లా అంతా విస్తరించింది. దీంతో అనంతపురం రైతులు బొప్పాయి, కర్బూజా, దోస, ఢిల్లీ దోస, పుచ్చకాయ (కళంగరికాయ), మామిడి, ద్రాక్ష పంటలు విపరీతంగా వేశారు. ఇపుడు ఇవి దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లో పళ్లన్నీ అనంతపురంవే. దీంతో నేరుగా కేంద్రం ఇక్కడి నుంచి కిసాన్ రైలు వేసింది.
ఇక చిత్తూరులో ఏనాడూ నీరు తడవని ప్రాంతం కూడా హంద్రీ నీవా ద్వారా అందిన కృష్ణాజలాలతో ఉప్పొంగుతోంది. చంద్రబాబు గత 5 ఏళ్లలో సాగునీటిపై ఎక్కువ దృష్టిపెట్టారు. చిత్తూరు దాకా తీసుకెళ్లారు. పులివెందులకు కూడా చంద్రబాబు నీళ్లిచ్చారు. దీంతో 20 ఏళ్లలో రాయలసీమ ఎంతో మారింది.
కింద ఉన్న ఫొటో ఆళ్లగడ్డ-నంద్యాల మధ్య ప్రాంతంలో తీసింది