‘మంచు’ ఫ్యామిలీ మెంబర్స్‌కు సోషల్ మీడియా ట్రోలింగ్ కొత్తేమీ కాదు. మోహన్ బాబు ఘన వారసత్వాన్నందుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన ముగ్గురు పిల్లల్లో ఎవ్వరూ అంచనాలను అందుకోలేకపోయారు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు.
దీనికి తోడు ఆ ముగ్గురూ బయట చేసే వ్యాఖ్యలు ట్రోలర్స్‌కు మంచి కంటెంట్ ఇస్తుంటాయి. ముఖ్యంగా విష్ణు, లక్ష్మీ ప్రసన్నల భాష, వాళ్లు అప్పుడప్పుడూ మాట్లాడే అతిశయోక్తి మాటలు ట్రోలర్స్ పంట పండించేస్తుంటాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను వాళ్లు సరదాగానే తీసుకుంటూ తమపై వచ్చిన ట్రోల్స్‌ను స్వయంగా షేర్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ వాళ్లు హర్టవుతారనే సమస్య కూడా లేదు.
ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటి చేస్తున్న నేపథ్యంలో విష్ణు కొన్ని రోజులుగా మీడియాలో బాగా కనిపిస్తున్నాడు. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు.తాజాగా విష్ణు ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియా జనాలకు మంచి వినోదాన్నిస్తున్నాయి.
Manchu Vishnu for Maa elections https://t.co/XbQIqTc6sR
— ???????????????? ???????????????????? (@ManiVarma225) October 5, 2021
ముఖ్యంగా ట్రోలర్స్‌కు విష్ణు మామూలు కంటెంట్ ఇవ్వలేదు. నిన్న సాయంత్రం నుంచి వైరల్ అవుతున్న రెండు వీడియోల సంగతే చూస్తే.. అందులో ఒకదాంట్లో ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన ప్రకాష్ రాజ్‌కు తెలుగు వారి గురించి తెలిసింది శూన్యమని అన్నాడు విష్ణు. అంతటితో ఆగకుండా ప్రకాష్ రాజ్.. కందుకూరి వీరేశలింగం పంతులు గురించి చెప్పాలని అన్నాడు.
కానీ ఇక్కడ విష్ణు మాట తడబడింది. కందుకూరి అన్నంత వరకు ఓకే కానీ.. తర్వాత వీరేహం పకాహం అంటూ ఏదో అనేశాడు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? దాని మీద బోలెడన్ని మీమ్స్ చేసి వదిలేశారు. ఇంకో వీడియోలోనేమో.. వారసత్వం గురించి మాట్లాడుతూ.. ‘‘నేను నా ఫ్యామిలీ పేరును వాడుకుని ముందుకెళ్లేట్లయితే ఈపాటికి ఇండియాలోనే నంబర్ వన్ సూపర్ స్టార్ అయ్యేవాడిని’’ అన్నాడు విష్ణు.
ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాడుకుని ఉంటే నేను ఇండియాలోనే నంబర్ ఒన్ హీరో అయి ఉండేవాడిని: మంచు విష్ణు
పాడు సినిమా లోకం.. ఓ ట్యాలెంట్‌ని తొక్కేసింది ????????
— . (@SaradhiTweets) October 5, 2021
దీనిపై రకరకాల భాష్యాలు చెబుతూ విష్ణును ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇదిలా ఉండగా ‘కేజీఎఫ్’ సినిమాను ప్రశాంత్ నీల్ తనతోనే తీయాలనుకున్నాడని.. కానీ తనకు కథ నచ్చక తిరస్కరించినట్లుగా మంచు విష్ణు అన్నట్లుగా కనిపిస్తున్న ఒక సోషల్ మీడియా పోస్ట్ మీదా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
File a case on Manchu Vishnu for not to speak our beloved freedom fighter & First CM of United Andhra Pradesh name properly.
తెలుగు పలకడం రాదు తెలుగు ఆర్టిస్టులకు అధ్యక్షుడు ఐపోతాదంట. https://t.co/6k5qh2FhPl
— Srinu4JSP???? ???? (@SriniIndian_) October 4, 2021
Manchu Vishnu https://t.co/EoziN638zm pic.twitter.com/uhkIoRGlQ5
— Dileep OG ????️ (@J_Messi_) October 4, 2021