నటుడు మంచు విష్ణు శనివారం హైదరాబాద్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ నిర్వహించారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో వర్గాలుగా విడిపోయినా కళాకారుల కోణంలో అందరూ ఒకటే. అయినప్పటికీ ఈసూత్రాన్ని మంచు విష్ణు విస్మరించారు.
మంచు విష్ణు ఇటీవల పవన్ కళ్యాణ్‌ని కలిసినప్పటికీ, ఆయనతో ఆత్మీయంగా చాట్ చేసినప్పటికీ, చిరంజీవికి లేదా పవన్ కళ్యాణ్‌కు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపకపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమాకు మెగాస్టార్ చిరంజీవే. అతనికి ఆహ్వానం పంపకపోవడం పొరపాటనే చెప్పాలి.
ఇక ఈ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు హాజరు కాలేదు.
నందమూరి బాలకృష్ణ, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్ మరియు బ్రహ్మానందం వంటి సీనియర్ నటులను విష్ణు ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కానీ అతను మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించలేదు.
దీన్ని బట్టి మోహన్ బాబు కుటుంబం మరియు మెగా క్యాంప్ మధ్య బహిరంగ యుద్ధం మొదలైందని చెప్పొచ్చు.