మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ అంటే.. అందరికీ సుపరిచితమే. మంచు విష్ణు, మంచు లక్ష్మీప్రసన్నలను సోషల్ మీడి యాలో నెటిజన్లు తెగ ఆడేసుకుంటారు. స్నో.. అక్క, స్నో అన్న.. అంటూ.. వారిని ఏకేస్తుంటారు. దీనికి కార ణం.. వారు మాట్లాడే మాటకు.. చేసే పనికి ఎక్కడా పొంతన ఉండకపోవడమే. మాటల్లో తడబాటు.. చేసే ప్రసంగాల్లో తప్పులు వంటివాటిని సోషల్ మీడియా జనాలు ఆడేసుకునేందుకు ఒక చక్కని వేదికగా స్నో కుటుంబం మారిపోయింది.
ఇక, ఇదేకుటుంబానికి పెద్ద మంచు మోహన్‌బాబు.. డైలాగ్ కింగ్ కూడా.. మాటలకు దొరికి పోతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నానెటిజన్లు ఆడేసుకుంటున్నారు. గతంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడి, రాజమండ్రి, తిరుపతి వంటి చోట్ల ప్రచారం చేసిన ఆయన .. తాజాగా పొలిటికల్ పంచ్‌లు రువ్వారు. వైసీపీకి తనకు పెద్దగా సంబంధం లేదన్నారు. అంతేకాదు.. తాను ఇప్పుడు రాజకీయంగా కూడా యాక్టివ్గాలేనని చెప్పారు. రాజకీయాలు కుళ్లిపోయాయని అన్నారు.
అయితే.. ఇవన్నీ చిత్రమైన డైలాగులుగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. మంచు విష్ణు(మా ప్రెసిడెంట్) ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా.. జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మా బావ.. అని తాను వారి ఇంటి అల్లుడినని ఇలా చెప్పుకొంటారు. అంతేకాదు.. మా వివాదాల సమయంలోను.. తర్వాత.. టికెట్ల రగడ విషయంలో రహస్యంగా ఒకసారి.. తర్వాత ఒకసారి జగన్‌తో భేటీ అయ్యారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా మోహన్‌బాబు మాత్రం అసలు తమకు వైసీపీతో సంబంధం లేదని మంచు వారు పంచ్ విసురుతున్నారు.
ఇది నిజమేనా? మంచు వారు చెప్పిన మాట నమ్మొచ్చా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఆయన ఆశించిన పదవులు దక్కలేదు. వాస్తవానికి మోహన్‌బాబు.. రాజ్యసభ సీటును ఆశించారు. అదేసమయంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని కూడా ఆశించారు. ఇవేవీ ఆయనకు దక్కలేదు. దీంతో ఇప్పుడు ఏకంగా.. తాను వైసీపీలోనే లేనని ఇటీవల తనపుట్టిన రోజు సందర్భంగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఏదేమైనా మంచు వారి పంచ్‌కు స్నూఫ్‌లు కౌంటర్లే తప్ప.. సింపతీ అయితే రావడం లేదని అంటున్నారు.
mohanbabu about ys jagan pic.twitter.com/JEWDEKNnj0
— AK4 (@0nlyforPSPK) March 21, 2023